Telegram Group
Join Now
---Advertisement---
AP polavaram Project Jobs 2025

AP polavaram Project Jobs 2025 | పోలవరం ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ జాబ్స్

By Afzal

Published on:

AP polavaram Project Jobs 2025 ఏపీలోని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆర్ & ఆర్ కార్యాలయాల్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

AP polavaram Project Jobs 2025

పోస్టుల వివరాలు : 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నఆర్ & ఆర్ కార్యాలయాలు, రంపచోడవరం, ఏటపాక, చింతూరులో విధులు నిర్వర్తించడానికి ఆవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 06

పోస్టు పేరుఖాళీలు
సీనియర్ అసిస్టెంట్01
వర్క్ ఇన్ స్పెక్టర్02
డేటా ఎంట్రీ ఆపరేటర్02
ఆఫీస్ సబార్డినేట్01

అర్హతలు : 

AP polavaram Project Jobs 2025 ఉద్యోగాలు పోస్టును అనుసరించి అర్హతలు మారుతాయి. 

పోస్టు పేరు అర్హతలు
సీనియర్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ
వర్క్ ఇన్ స్పెక్టర్సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బీటెక్
డేటా ఎంట్రీ ఆపరేటర్BCA / MCA లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్ లో డిగ్రీ
ఆఫీస్ సబార్డినేట్10వ తరగతి

Note : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

వయస్సు :  

AP polavaram Project Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-09-2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

AP polavaram Project Jobs 2025 పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

AP polavaram Project Jobs 2025 పోస్టులకు కింది దశలలో ఎంపిక చేేస్తారు. 

పోస్టు పేరుఎంపిక ప్రక్రియ
సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
ఆఫీస్ సబార్డినేట్విద్యార్హతలో మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా

జీతం : 

AP polavaram Project Jobs 2025 పోస్టులకు ఎంపికైన వారికి జీతం ఎంత ఇస్తారనే వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం చెల్లించడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP polavaram Project Jobs 2025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టెడ్ చేయించి కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి. 

కావాల్సిన ధ్రువపత్రాలు: 

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • స్టడీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
  • రెసిడెన్స్ సర్టిపికెట్
  • ఆధార్ కార్డు
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతరములు

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్: 

ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీ.ఆర్.పీ గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్.

  • దరఖాస్తులకు చివరి తేేదీ : 07 – 04 – 2025

Notification : CLICK HERE

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News