ISRO Scientist / Engineer Recruitment 2025 | ఇస్రోలో సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Afzal

On: May 2, 2025

Follow Us:

ISRO Scientist / Engineer Recruitment 2025

ISRO Scientist / Engineer Recruitment 2025 ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు స్వీకరిస్తున్నారు. 

ISRO Scientist / Engineer Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇస్రో అనుబంద సంస్థ అయిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు (ICRB) నుంచి సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఇవి గ్రూప్ ‘ఎ’ గెజిటెడ్ ఉద్యోగాలు.  ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, శ్రీహరికోట, తిరువనంతపురం, మహేంద్రగిరి, వలియమల,  హసన ఇస్రో కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 63
పోస్టు కేటగిరీలుఖాళీల సంఖ్య
ఎలక్ట్రానిక్స్22
మెకానికల్33
కంప్యూటర్ సైన్స్08

అర్హతలు : 

ISRO Scientist / Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE / B.Tech లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • కనీసం 65% మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్ లో 6.84 CGPA ఉండాలి. 
  • అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్  విభాగంలో  చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి. 

వయస్సు: 

ISRO Scientist / Engineer Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులకు  దరఖాస్తు చేసుకునే  అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల  మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు : 

ISRO Scientist / Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.  

ఎంపిక ప్రక్రియ: 

ISRO Scientist / Engineer Recruitment 2025  సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న  అభ్యర్థులను  చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • ముందుగా అభ్యర్థులను వారి చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 1:7 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • గేట్ స్కోర్ – 50 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులు – 50 శాతం  వెయిటేజీ ఉంటుంది.  రెండింటిలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

జీతం వివరాలు : 

ISRO Scientist / Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ -10 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. నెలకు రూ.56,100/- బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు DA, HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. 

దరఖాస్తు విధానం: 

ISRO Scientist / Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. 

  • ముందుగా అధకారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • తర్వాత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ జాగ్రత్తగా చదివి దరఖాస్తు ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ29 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ19 – 05 – 2025
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ21 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment