AP Outsourcing Jobs 2025 | ఏపీలో మెడికల్  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

By: Afzal

On: May 2, 2025

Follow Us:

AP Outsourcing Jobs 2025 

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీలో ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసకోవాలి. 

AP Outsourcing Jobs 2025 

పోస్టుల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది. 19 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 15 పోస్టులు,  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

  • మొత్తం పోస్టుల సంఖ్య : 79
పోస్టు పేరుGMC ఖాళీలుGGH ఖాళీలు
కంప్యూటర్ ప్రోగ్రామర్0101
ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్0100
ఎలక్ట్రికల్ హెల్పర్0102
మార్చురీ అటెండెంట్0100
ఆఫీస్ సబార్డినేట్0913
అనస్థీషియా టెక్నీషియన్0001
కార్డియాలజీ టెక్నీషియన్0003
ఎమర్జెన్సీ  మెడికల్ టెక్నీషియన్0025
ల్యాబ్ టెక్నీషియన్0001
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్0001
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్0001
సైకియాట్రిక్ సోషల్ వర్కర్0002
స్పీచ్ థెరపిస్ట్0001
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్0001
జనరల్ డ్యూటీ అటెండెంట్0108
స్టోర్ అటెండెంట్0002
చైల్డ్ సైకాలజిస్ట్0001
క్లినికల్ సైకాలజిస్ట్0001
ల్యాబ్ అటెండెంట్0100
మొత్తం1564
రిక్రూట్మెంట్ విధానంగవర్నమెంట్ మెడికల్ కాలేజీగవర్నమెంట్ జనరల్ హాస్పిటల్
కాంట్రాక్ట్0239
ఔట్ సోర్సింగ్1325

అర్హతలు : 

AP Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా వంటి అర్హతలు ఉండాలి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన నోటిఫికేషన్ ని చూడగలరు. 

వయస్సు: 

AP Outsourcing Jobs 2025 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

AP Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. అభ్యర్థులు ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రాజమహేంద్రవరం పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
జనరల్రూ.500/-
SC / ST / BC / EWS / ఎక్స్ సర్వీస్ మెన్రూ.300/-

ఎంపిక విధానం: 

AP Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • విద్యార్హతల్లో మార్కులు – 75% వెయిటేజ్
  • అనుభవం  (ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ / కోవిడ్ సర్వీస్) – 15% వెయిటేజీ
  • విద్యలో సీనియారిటీ : 10% వెయిటేజీ

జీతం వివరాలు: 

AP Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.15,000/- నుంచి రూ.54,000/- వరకు జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం: 

AP Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ జాగ్రత్తగా నింపి అవసరమైన పత్రాలు జత చేసి the Principal / Addl. DME, Government Medical College, Rajamahendravaram, East Godavari district నేరుగా లేదా పోస్టు ద్వారా పంపాలి. కింద పేర్కొన్న సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ తో జత చేయాలి. 

కావాల్సిన  ధ్రువపత్రాలు:

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి హాజరైనట్లు ప్రూఫ్
  • అన్ని మార్క్స్ మెమోలు
  • ఏపీ పారా మెడికల్ బోర్డు లేదా సంబంధిత హెల్త్ కేర్ సైన్సెస్ లేదా ఇతర కౌన్సిల్ నందు రిజిస్టర్ అయిన సర్టిఫికెట్లు
  • 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • EWS సర్టిఫికెట్ (అవసరమైన వారికి)
  • సదరం సర్టిఫికెట్ (అవసరమైన వారికి)
  • సర్వీస్ సర్టిఫికెట్

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులు ప్రారంభ తేదీ01 – 05 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ12 – 05 – 2025 సాయంత్రం 4 గంటల లోపు
దరఖాస్తుల స్క్రుటినిటీ27 – 05 – 2025 వరకు
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల29 – 05 – 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల10- 06 – 2025
ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల13 – 06 – 2025
కౌన్సిలింగ్ మరియు జాబ్ అపాయింట్మెంట్ తేదీ16 – 06 – 2025
NotificationCLICK HERE
Application DownloadCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment