DRDO Scientist B Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిస్ట్ బి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. DRDO, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) మరియు రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ రకాల పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజులకు ముగుస్తుంది. ఈ ఉద్యోగాల కోసం ప్రకటన మే 24వ తేదీన వచ్చే అవకాశం ఉంది.
DRDO Scientist B Recruitment 2025
భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. DRDO – రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి సైంటిస్ట్ బి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల వివరాలు కింద చూడవచ్చు.
సంస్థ పేరు | ఖాళీలు |
DRDO Scientist B | 127 |
ADA Engineer / Scientist B | 09 |
Scientist B Encadred Posts | 12 |
విభాగాలు మరియు ఖాళీల వివరాలు:
విభాగాలు | సంస్థ మరియు ఖాళీలు |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | DRDO : 35 ADA : 03 WESEE : 02 |
మెకానికల్ ఇంజనీరింగ్ | DRDO : 33 ADA : 01 |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | DRDO : 29 ADA : 03 CME : 01 WESEE : 01 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | DRDO : 06 CME : 01 |
మెటీరియల్ ఇంజనీరింగ్ / మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / మెటలర్జికల్ ఇంజనీరింగ్ | DRDO : 04 ADA : 01 |
ఫిజిక్స్ | DRDO : 04 |
కెమిస్ట్రీ | DRDO : 03 |
కెమికల్ ఇంజనీరింగ్ | DRDO : 03 |
ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ | DRDO: 05 ADA : 01 |
మ్యాథెమ్యాటిక్స్ | DRDO : 02 ADA : 01 |
సివిల్ ఇంజనీరింగ్ | DRDO :01 |
బయో మెడికల్ ఇంజనీరింగ్ | DRDO : 02 |
ఎంటమాలజీ | AFMC : 01 |
బయో స్టాటిస్టిక్స్ | AFMC : 01 |
క్లినికల్ సైకాలజీ | AFMC : 01 |
సైకాలజీ | SCN / SCC : 03 |
అర్హతలు :
DRDO Scientist B Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో కనీసం ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు చెల్లు బాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
- మెకానికల్ ఇంజనీరింగ్: మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజీనిరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
- ఫిజిక్స్ : ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
- కెమిస్ట్రీ : కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
- క్లినికల్ సైకాలజీ : క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ మరియు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో క్లినికల్ సైకాలజిస్ట్ గా రిజిస్ట్రేషన్. హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ లో చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్.
వయస్సు :
DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
DRDO Scientist B Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం వివరాలు :
DRDO Scientist B Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-10 ప్రకారం జీతం అందజేస్తారు. బేసిక్ పే రూ.56,100/- ఉంటుంది. చేసే సమయంలో అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.1,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
DRDO Scientist B Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు RAC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు RAC వెబ్ సైట్ ని సందర్శించా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తర్వత లాగిన్ అయ్యి అప్లికేషన్ పారమ్ నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
DRDO Scientist B Recruitment 2025 పోస్టులకు ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన కోసం RAC వెబ్ సైట్ ని సందర్శించండి.
Notification | CLICK HERE |
Online Apply Website | CLICK HERE |