CSL Fireman Recruitment 2025 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫైర్ మెన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ మరియు కుక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంగా అప్లికేషన్లు పెట్టుకోవాలి.
CSL Fireman Recruitment 2025
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వం యొక్క ప్రీమియమ్ మినీరత్న షెడ్యూల్ ‘ఎ’ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మెన, సెమీ స్కిల్డ్ రిగ్గర్ మరియు కుక పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సంస్థ పేరు : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
- పోస్టు పేరు : ఫైర్ మెన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్, కుక్
- పోస్టుల సంఖ్య : 25
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఫైర్ మెన్ | 15 |
సెమీ స్కిల్డ్ రిగ్గర్ | 09 |
కుక | 01 |
అర్హతలు:
CSL Fireman Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి.
పోస్టు పేరు | అర్హతలు |
ఫైర్ మెన్ | 10వ తరగతి ఉత్తీర్ణత + రాష్ట్ర అగ్నిమాపక దళం లేదా ప్రభుత రంగ సంస్థ నుంచి అగ్నిమాపక శిక్షణ లేదా సాయుధ దళాలలో గుర్తింపు పొందిన అగ్నిపమాపక కోర్సు లేదా రాష్ట్ర అగ్నిమాపక దళం నుంచి ఫైర్ వాచ / పెట్రోల్ లో శిక్షణ+రాష్ట్ర అగ్నిపమాక దళంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా సాయుధ దళాలలో ఒక సంవత్సరం అనుభవం (లేదా) ఫైర్ వాచ్ మెన్ గా ఐదు సంవత్సరాల అనుభవం. |
సెమీ స్కిల్డ్ రిగ్గర్ | 4వ తరగతి ఉత్తీర్ణత+షిప బిల్డింగ్ / షిప్ రిపేర్ యార్డ్ / ఇంజనీరింగ్ కంపెనీలో హెవీ డ్యూటీ మెషిన పార్ట్స్ రిగ్గింగ్, యంత్రాలు లేదా పరికరాల నిర్మాణంలో సహాయం చేయడంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం |
కుక్ ఫర్ కొచ్చిన్ షిప్ యార్డ్ గెస్ట్ హౌస్ | 7వ తరగతి ఉత్తీర్ణత+వంట వండటంతో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
వయస్సు:
CSL Fireman Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
CSL Fireman Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
CSL Fireman Recruitment 2025 పోస్టులకు ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1లో ఆబ్జెక్టివ్ పరీక్ష మరియు ఫేజ్-2 లో ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఆబ్జెక్టివ్ పరీక్ష : 30 మార్కులకు
- ప్రాక్టికల్ టెస్ట్ : 70 మార్కులకు
జీతం వివరాలు :
CSL Fireman Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.21,300/- నుంచి రూ.69,840/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.38,407/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
CSL Fireman Recruitment 2025 ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 28, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 20, 2025
Notification | Click here |
Apply Online | Click here |