BPCL Recruitment 2025 | భారత్ పెట్రోలియంలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

By: Afzal

On: June 4, 2025

Follow Us:

 BPCL Recruitment 2025

BPCL Recruitment 2025  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్(అకౌంట్స్) మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

 BPCL Recruitment 2025

పోస్టుల వివరాలు : 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ తో సహా వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. 

అర్హతలు : 

BPCL Recruitment 2025  ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి. 

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) : మెకనికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా + 5 సంవత్సరాల అనుభవం
  • అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్) : సంబంధిత విభాగాల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత + 3 సంవత్సరాల అనుభవం
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) : ఇంటర్ సీఏ లేదా ఇంటర్ సీఎంఏతో గ్రాడ్యుయేషన్ +  5 సంవత్సరాల అనుభవం
  • అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(క్వాలిటీ) : ఆర్గానిక్ / ఇనార్గానిక్ / ఫిజికల్/ అనలిటికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ +  3సంవత్సరాల అనుభవం
  • సెక్రటరీ : గ్రాడ్యుయేషన్ + 5 సంవత్సరాల అనుభవం 

వయస్సు : 

BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) పోస్టుకు మాత్రం కనిష్ట వయస్సు 30 సంవత్సరాలు – గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,180/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: 

BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులను ముందుగా అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

  • షార్ట్ లిస్ట్
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

BPCL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలను బట్టి జీతం ఉంటుంది. 

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ : నెలకు రూ.30,000 – రూ.1,20,000/- (ఏడాది ప్యాకేజీ దాదాపు రూ.11.86 లక్షలు) ఉంటుంది.  
  • అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ : నెలకు రూ.40,000 – రూ.1,40,000/-(ఏడాది ప్యాకేజీ దాదాపు రూ.16.64 లక్షలు) ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

BPCL Recruitment 2025  పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజీలో BPCL Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమై తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 మే, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 27 జూన్,2025
NotificationClick here
Apply Online Click here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment