GSL Non Executive Recruitment 2025 గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జులై 12వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
GSL Non Executive Recruitment 2025 Overview :
నియామక సంస్థ | గోవా షిప్ యార్డ్ లిమిటెడ్(GSL) |
పోస్టు పేరు | నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు |
పోస్టుల సంఖ్య | 102 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 12 జులై – 11 ఆగస్టు, 2025 |
ప్రాతిపదిక | కాంట్రాక్ట్ |
పోస్టుల వివరాలు :
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది భారత్ ప్రభుత్వ డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క షెడ్యూల్ ‘బి’ మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ. ఈ కంపెనీ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయడం జరిగింది. మొత్తం 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టును భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు:
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ సూపర్ వైజర్ (సేఫ్టి – ఎలక్ట్రికల్) | 01 |
జూనియర్ సూపర్ వైజర్ (పెయింట్) | 02 |
అసిస్టెంట్ సూపరింటెండెంట్(ఫైనాన్స్) | 02 |
అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హిందీ ట్రాన్స్ లేటర్) | 01 |
టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) | 15 |
టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) | 10 |
టెక్నికల్ అసిస్టెంట్ (షిప్ బిల్డింగ్) | 15 |
నర్స్ (పురుషుడు) | 01 |
ఆఫీస్ అసిస్టెంట్ – క్లరికల్ స్టాఫ్ | 12 |
ఆఫీస్ అసిస్టెంట్ – క్లరికల్ (ఢిల్లీ ఆఫీస్) | 02 |
ఆఫీస్ అసిస్టెంట్ (ఫైనాన్స్ / IA) | 03 |
షిప రైట్ ఫిట్టర్ | 04 |
స్ట్రక్చరల్ ఫిట్టర్ | 10 |
వెల్డర్ | 08 |
మెషినిస్ట్ | 04 |
సేఫ్టీ స్టివార్డ్ | 04 |
పెయింటర్ | 08 |
మొత్తం | 102 |
అర్హతలు :
GSL Non Executive Recruitment 2025 అభ్యర్థులు పోస్టును బట్టి 10వ తరగతి / ఐటీఐ / డిప్లొమా / గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి.
- 10వ తరగతి / ఐటీఐ / డిప్లొమా / గ్రాడ్యుయేట్
- పోస్ట్ వైజ్ 1-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
GSL Non Executive Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి గరిష్ట వయస్సు 33 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
GSL Non Executive Recruitment 2025 పోస్టులకు జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ మరియు మాజీ సైనికులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
GSL Non Executive Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో 25 శాతం జనరల్ ఆప్టిట్యూడ్ మరియు 75 శాతం ట్రేడ్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
- స్కిల్ / ట్రేడ్ టెస్ట్ : పోస్టు ఆధారంగా ప్రాక్టికల్ లేదా టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.
- డాక్యమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
GSL Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
సంవత్సరం | జీతం |
1వ సంవత్సరం | రూ.28,700 – రూ.41,400/- |
2వ సంవత్సరం | రూ.30,200 – రూ.43,500/- |
3వ సంవత్సరం | రూ.31,800 – రూ.45,700/- |
దరఖాస్తు విధానం :
GSL Non Executive Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో GSL Career పై క్లిక్ చేసి పోస్టును ఎంచుకోవాలి.
- Apply Now పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసమరైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Official website | Click here |
No comments
Naku job kavali sir pillz