Andhra University Faculty Jobs 2025 ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ డిపార్టెంట్లలో తాత్కాలిక ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆస్తిగల అభ్యర్థులు జులై 13వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు :
Andhra University Faculty Jobs 2025 ఆంధ్రయూనివర్సిటీ వివిధ విభాగాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల సంఖ్య పేర్కొనలేదు.
అర్హతలు :
Andhra University Faculty Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ / పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. ఆసక్తిగల అర్హత గల అభ్యర్థులు, UGC / AICTE / PCI / BCI / NCTE / COA నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ:
Andhra University Faculty Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జులై 16వ తేదీ నుంచి ఉంటుంది.
ఇంటర్వ్యూకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్:
- అప్లికేషన్ ఫారమ్
- పీజీ, పీహెచ్డీ ఒరిజనల్ సర్టిఫికెట్లు
- అన్ని సర్టిఫికెట్లు ఒక సెట్ జిరాక్స్ కాపీలు
- 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు
జీతం :
Andhra University Faculty Jobs 2025 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సబ్జెక్టుకు గంటకు రూ.750/- చొప్పున చెల్లిస్తారు. ల్యాబ్ వర్క్ ఉంటే గంటకు రూ.500/- ఇస్తారు. గరిష్టంగా రూ.1,10,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
Andhra University Faculty Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కిందకు స్క్రోల్ చేస్తే నోటిస్ బోర్డు ఉంటుంది. అక్కడ విభాగాల వారీగా నోటిఫికేషన్లు చూడొచ్చు.
- అప్లయ్ చేయడానికి ‘క్లిక్ హియర్ టు అప్లయ్’ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్పుడు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ లో వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ నింపిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు చివరి తేదీ : 13 జులై, 2025
- ఇంటర్వ్యూలు ప్రారంభం : 16 జులై, 2025
Notification | Click here |
Apply Online | Click here |