CDAC ACR Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్(ACR) ప్రాజెక్ట్ కింద వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ మరియ ఇతర పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జులై 5వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CDAC ACR Recruitment 2025 Overview :
నియామక సంస్థ | సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) |
పోస్టుల సంఖ్య | 280 |
ప్రాజెక్ట్ పేరు | అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ |
పోస్టు పేరు | డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు |
జాబ్ లొకేషన్ | భారత దేశం అంతటా |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్ (ACR) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డొమైన్ ఏరియా వారీగా ఖాళీలు:
- చిప్ డిజైన్ : 180
- ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్ డిజైన : 25
- సాఫ్ట్ వేర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ : 65
- ఫోటోనిక్స్ : 10
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డిజైన్ ఇంజనీర్ E1 | 203 |
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2 | 67 |
ప్రిన్సిపల డిజైన్ ఇంజనీర్ E3 | 5 |
టెక్నీకల్ మేనేజర్ E4 | 3 |
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5 | 1 |
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6 /కన్సల్టెంట్ | 1 |
అర్హతలు :
CDAC ACR Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- BE / B.Tech (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్)
- ME / M.Tech (మైక్రో ఎలక్ట్రానిక్స్ / VLSI, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫోటోనిక్స్
- MSC(కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ మ్యాథ్స్)
- MCA
- పీజీ డిప్లొమా (విఎల్ఎస్ఐ, హెచ్పీసీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / మెషిన లెర్నింగ్)
- పీహెచ్డీ (మైక్రో ఎలక్ట్రానిక్స్/ విఎల్ఎస్ఐ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫికేషియల్ ఇంటెలిజెన్స్ / మెషిన్ లెర్నింగ్, ఫోటోనిక్స్)
- డిగ్రీలో కనీసం 60% CGPA స్కోర్ తప్పనిసరి.
పోస్టుల వారీగా అనుభవం :
పోస్టు పేరు | అనుభవం |
డిజైన్ ఇంజనీర్ E1 | 0-3 సంవత్సరాలు (ఫ్రెషర్లు అప్లయ్ చేసుకోవచ్చు) |
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2 | 3 – 6 సంవత్సరాలు |
ప్రిన్సిపల డిజైన్ ఇంజనీర్ E3 | 6 – 9 సంవత్సరాలు |
టెక్నీకల్ మేనేజర్ E4 | 9 -13 సంవత్సరాలు |
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5 | 13 – 18 సంవత్సరాలు |
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6 /కన్సల్టెంట్ | 18 సంవత్సరాలు |
వయోపరిమితి :
CDAC ACR Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- డిజైన్ ఇంజనీర్ E1 : 30 సంవత్సరాలు
- సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2: 33 సంవత్సరాలు
- ప్రిన్సిపల డిజైన్ ఇంజనీర్ E3 : 37 సంవత్సరాలు
- టెక్నికల్ మేనేజర్ E4 : 41 సంవత్సరాలు
- సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5 : 46 సంవత్సరాలు
- చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6 / కన్సల్టెంట్ : 50 – 65 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
CDAC ACR Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CDAC ACR Recruitment 2025 పోస్టుకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- రాత పరీక్ష(వర్తిస్తే)
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
CDAC ACR Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి సంవత్సరం ప్యాకేజీతో జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | జీతం |
డిజైన్ ఇంజనీర్ E1 | ₹18 LPA |
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2 | ₹21 LPA |
ప్రిన్సిపల డిజైన్ ఇంజనీర్ E3 | ₹24 LPA |
టెక్నీకల్ మేనేజర్ E4 | ₹36 LPA |
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5 | ₹39 LPA |
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6 /కన్సల్టెంట్ | ₹42 LPA |
దరఖాస్తు విధానం :
CDAC ACR Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ బటన్ క్లిక్ చేసి, మొబైల్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా లాగిన అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 5 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 జులై, 2025
Notification | Click here |
Apply Online | Click here |