HAL Aircraft Technician Recruitment 2025 హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 22వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
HAL Aircraft Technician Recruitment 2025 Overview:
నియామక సంస్థ | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ |
పోస్టుల సంఖ్య | 06 |
జాబ్ లొకేషన్ | పొర్ బందర్, రత్నగిరి, విశాఖపట్నం, మిస్సామారి |
అప్లికేషన్ మోడ్ | ఆఫ్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 22 జులై, 2025 |
పోస్టుల వివరాలు :
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు పోర్ బందర్, రత్నగిరి, వైజాగ్ మరియు మిస్సామారిలోని కస్టమర్ బేస్లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ ఖాళీలు :
- ఎయిర్ ఫ్రేమ్ : 02 పోస్టులు
- ఎలక్ట్రికల్ : 04 పోస్టులు
అర్హతలు :
HAL Aircraft Technician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మెకానికల్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి :
HAL Aircraft Technician Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
HAL Aircraft Technician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
HAL Aircraft Technician Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్ట్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ప్రీ-ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
HAL Aircraft Technician Recruitment 2025 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
HAL Aircraft Technician Recruitment 2025 పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా అప్లికేషన్లు పంపాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- స్వీయ ధ్రువీకరించిన పత్రాలను జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని పోస్టు ద్వారా కింది అడ్రస్ కి పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్
- హెలికాప్టర్ MRO డివిజన్, హిందూస్తాన ఏరోనాటిక్స్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ – 1796, విమానపుర పోస్ట్, బెంగళూరు – 560017, కర్ణాటక
- దరఖాస్తులు 22 జులై, 2025 లోపు చేరాలి.
Notification | Click here |
Official Website | Click here |