NMDC Junior Manager Recruitment 2025 హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 8వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
NMDC Junior Manager Recruitment 2025 Overview :
నియామక సంస్థ | నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) |
పోస్టు పేరు | జూనియర్ మేనేజర్(ఫైనాన్స్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) |
పోస్టుల సంఖ్య | 17 |
జాబ్ టైప్ | పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 28 జులై, 2025 |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ ‘నవరత్న’ ప్రభుత్వ రంగ సంస్థ అయిన NMDC నుంచి జూనియర్ మేనేజర్(ఫైనాన్స్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) : 10 పోస్టులు
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) : 07 పోస్టులు
అర్హతలు :
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింద అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు మరియు అనుభవం |
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) | బ్యాచిలర్ డిగ్రీ + CA / CMA లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తో MBA (ఫైనాన్స్) + 2 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) | బ్యాచిలర్ డిగ్రీ + CA / CMA లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తో MBA (ఫైనాన్స్) + 12 సంవత్సరాల అనుభవం |
వయోపరిమితి :
NMDC Junior Manager Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) : 30 సంవత్సరాలు
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) : 45 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- UR / OBC / EWS : రూ.500/-
- SC / ST / PwBD / ExSm : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జూనియర్ మేనేజర్(ఫైనాన్స్) : రూ.50,000 – రూ.1,60,000/-
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) : రూ.1,00,000 – రూ.2,60,000/-
దరఖాస్తు విధానం :
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో నోటిఫికేషన్ ఫై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫొటోొ మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 08.07.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28.07.2025
Notification | Click here |
Apply Online | Click here |