AVNL HVF Recruitment 2025 ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ లో అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 19వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
AVNL HVF Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ – హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ |
పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ |
పోస్టుల సంఖ్య | 32 |
జాబ్ లొకేషన్ | చెన్నైలోని అవడి |
పోస్టుల వివరాలు :
చెన్నై, అవడిలోని ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ – హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ లో అసిస్టెంట్ మనేజర్ మరియు జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేసన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) | 02 |
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్) | 02 |
అసిస్టెంట్ మేనేజర్(ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్) | 01 |
జూనియర్ మేనేజర్ (మెకానికల్) | 17 |
జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) | 02 |
జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్) | 04 |
జూనియర్ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్మెంట్) | 01 |
జూనియర్ మేనేజర్ (హెచ్ఆర్) | 01 |
మొత్తం | 32 |
అర్హతలు :
AVNL HVF Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) : సంబంధిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ.
- అసిస్టెంట్ మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్) : ఇంజనీరింగ్ / టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ + MBA / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమాతో పాటు మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్
- అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్) : హ్యూమన్ రీసోర్సెస్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేదా PM&IRలో MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / డిప్లొమాతో పాటు ఫస్ట్ క్లాస్ డిగ్రీ
- జూనియర్ మేనేజర్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) : సంబంధిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా డిగ్రీ.
- జూనియర్ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్మెంట్) : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేటీరియల్ మేనేజ్మెంట్ ద్వారా గుర్తింపు పొందిన మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ లో కనీసం ఒక సంవత్సరం డిప్లొమాతో పాటు ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- జూనియర్ మేనేజర్ (హెచ్ఆర్) : పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా PM&IRలో కనీసం ఒక సంవత్సరం డిప్లొమాతోో పాటు ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయస్సు:
AVNL HVF Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
AVNL HVF Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు SBI కలెక్ట్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | ఫీజు |
UR / OBC / EWS | 300/- |
SC / ST / PwBD / Ex-SM / Women | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
AVNL HVF Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- దరఖాస్తుల పరిశీలన
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్ నెస్ మరియు పోలీస్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
AVNL HVF Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- అసిస్టెంట్ మేనేజర్ : నెలకు రూ.40,000 + IDA
- జూనియర్ మేనేజర్ : నెలకు రూ.30,000 + IDA
దరఖాస్తు విధానం :
AVNL HVF Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- దరఖాస్తు పారమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలు బ్లాక్ లెటర్స్ లో జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను అప్లికేషన్ తో అటాచ్ చేయాలి.
- నోటిఫికేషన్ లో సూచించిన విధంగా SBI కలెక్ట్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- పూర్తి చేసిన దరఖాస్తును కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
- చిరునామా : చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై-600054
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 09 ఆగస్టు, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |