DRDO DIBT Fellowship 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) – డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్(DIBT) నుంచి యంగ్ రీసెర్చ్ స్కాలర్స్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటు నాన్ DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (CSIR / UGC / DBT / ICMR ఫెలో షిప్ కలిగి ఉన్న అభ్యర్థులు) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిప్పటి నుంచి 30 రోజుల్లోపు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి.
పోస్టుల వివరాలు :
DRDO ఆధ్వర్యంలో ఉన్న మైసూర్ లోని డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT), ఫుడ్ సెక్యూరిటీ, పాథోజెన్ డిటెక్షన్, టాక్సిన్స్ మరియు మిలిటరీ న్యూట్రిషనల్ లో టెక్నాలజీలను డెవలప్ చేయడంపై ఫోకస్ పెడుతుంది. మల్టిపుల్ సైంటిఫిక్ విభాగాల్లో రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింంది.
DRDO ఫెలోషిప్ ఖాళీలు : 11 ఖాళీలు
పోస్టు పేరు | విభాగాలు | ఖాళీలు |
రీసెర్చ్ అసోసియేట్(RA) | ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ / ఫుడ్ ఇంజనీరింగ్ / ప్రాసెసింగ్ | 01 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) | మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ / బయోకెమిస్ట్రీ / బయోఇన్ఫర్మేటిక్స్ / మెడికల్ జెనెటిక్స్ | 07 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) | పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ / పాలిమిర్ కెమిస్ట్రీ / కెమిస్ట్రీ | 02 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) | ఫుడ్ సైన్స్ / ఫుడ్ టెక్నాలజీ / న్యూట్రిషన / ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ | 01 |

నాన్ – DRDO JRF ఖాళీలు : 32 ఖాళీలు
విభాగం | ఖాళీలు |
బయోకెమిస్ట్రీ | 02 |
బయోటెక్నాలజీ | 10 |
బయోఇన్ఫర్మేటిక్స్ | 02 |
మైక్రోబయాలజీ | 10 |
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ / ప్రాసెసింగ్ / న్యూట్రిషన్ | 06 |
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ / కెమిస్ట్రీ | 02 |
అర్హతలు :
DRDO DIBT Fellowship 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- రీసెర్చ్ అసోసియేట్ : ఫుడ్ సైన్స్ / ఫుడ్ ఇంజనీరింగ్ / ప్రాసెసింగ్ లో PhD లేదా 3 సంవత్సరాల రీసెర్చ్ అండ్ 1 SCI పబ్లికేషన్ లో M.Tech
- జూనియర్ రీసెర్చ్ ఫెలో (DRDO) : చెల్లుబాటు అయ్యే NET / GATE తో పీజీ లేదా M.TEch / BE / B.Tech
- నాన్ – DRDO JRF : CSIR / UGC / INSPIRE / DBT / DST / ICMR నుంచి నోటిఫైడ్ విభాగాల్లో ఒకదానిలో యాక్టివ్ ఫెలోషిప్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- రీసెర్చ్ అసోసియేట్ : 35 సంవత్సరాలు
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : 28 సంవత్సరాలు
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
DRDO DIBT Fellowship 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
DRDO DIBT Fellowship 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ స్క్రీనింగ
- రాత పరీక్ష (అవసరమైతే)
- షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
DRDO DIBT Fellowship 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంంది.
- రీసెర్చ్ అసోసియేట్ : రూ.67,000/- + HRA
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : రూ.37,000/- + HRA
- నాన్ – DRDO JRF : ఏజెన్సీ నిబంధన ప్రకారం

దరఖాస్తు విధానం :
DRDO DIBT Fellowship 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించుకోవాలి.
- అభ్యర్థులు https://www.drdo.gov.in/drdo/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- సర్టిఫికెట్ల స్వీయ ధ్రువీకరించిన కాపీలను జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని ఎన్ క్లోజర్స్ తో కింది అడ్రస్ కి పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
- సెంటర్ హెడ్, డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్(DIBT), DRDO, సిద్ధార్థ నగర్, మైసూర్ – 570011 (కర్ణాటక)
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ తేదీ : 27 ఆగస్టు, 2025
- చివరి తేదీ : నోటిఫికేషన్ నుంచి 30 రోజులు
DRDO RA & JRF Fellowship Notification & Application | Click here |
Non – DRDO JRF Notification & Application | Click here |
Official Website | Click here |