AP DCHS Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో అప్లికేషన్లు సమర్పించుకోవాలి.
AP DCHS Outsourcing Jobs 2025
పోస్టుల వివరాలు :
అనంతపురం జిల్లా DCHS నియంత్రణలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య | నియామక విధానం |
బయో మెడికల్ ఇంజనీర్ | 01 | కాంట్రాక్ట్ |
రేడియోగ్రాఫర్ | 02 | కాంట్రాక్ట్ |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 | 04 | కాంట్రాక్ట్ |
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ | 01 | కాంట్రాక్ట్ |
ఫజియోథెరపిస్ట్ | 01 | ఔట్ సోర్సింగ్ |
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ | 02 | ఔట్ సోర్సింగ్ |
రికార్డ్ అసిస్టెంట్ | 02 | ఔట్ సోర్సింగ్ |
ఆఫీస్ సబార్డినేట్ | 03 | ఔట్ సోర్సింగ్ |
ల్యాబ్ అటెండెంట్ | 02 | ఔట్ సోర్సింగ్ |
పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ | 02 | ఔట్ సోర్సింగ్ |
GDA / MNO / FNO | 22 | ఔట్ సోర్సింగ్ |
ప్లంబర్ | 01 | ఔట్ సోర్సింగ్ |
మొత్తం పోస్టుల సంఖ్య | 43 |
అర్హతలు :
AP DCHS Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | అర్హతలు |
జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO | 10వ తరగతి |
ప్లంబర్ | 10వ తరగతి |
ఆఫీస్ సబార్డినేత్ | 10వ తరగతి |
పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ | 10వ తరగతి |
థియేటర్ అసిస్టెంట్ | 10వ తరగతి + నర్సింగ్ ఆర్డర్లీగా 5 సంవత్సరాల అనుభవం |
ల్యాబ్ అటెండెంట్ | 10వ తరగతి + ఇంటర్ లో ల్యాబ్ అటెండెంట్ ఒకేషనల్ కోర్సు లేదా ఇతర సంస్థల నుంచి ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేసి ఉండాలి. |
రికార్డ్ అసిస్టెంట్ | 10వ తరగతి |
ఫిజియోథెరపిస్ట్ | ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ + ఏపీ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్ లో రిజిస్ట్రేషన్ |
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ | ఇంటర్ + బీఎస్సీ(ఆడియాలజీ) లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ లేదా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ లేదా ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీలో డిగ్రీ |
ల్యాబ్ టెక్నీషియన్ | DMLT / BSc(MLT) + ఇంటర్మీడియట్ (VOC) తో ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ + APPMB రిజిస్టర్ అయి ఉండాలి అభ్యర్థికి DMLT మరియు BSc(MLT) రెండూ ఉంటే పైన పేర్కొన్న వాటిలో దేనిలైనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు |
రేడియో గ్రాఫర్ | CRA / DRGA / DMIT / BSc(రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ)లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. APPMB రిజిస్టర్ అయి ఉండాలి |
బయో మెడికల్ ఇంజనీర్ | బయోమెడికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ |
వయస్సు:
AP DCHS Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
AP DCHS Outsourcing Jobs 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజును ఆఫ్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ‘డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం’ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- OC / EWS / BC – రూ.500/-
- SC / ST / PwBD – రూ.300/-
ఎంపిక ప్రక్రియ:
AP DCHS Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP DCHS Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.
- బయో మెడికల్ ఇంజనీర్ – రూ.54,060/-
- రేడియోగ్రాఫర్ – రూ.35,570/-
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 – రూ.32,670/-
- ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – రూ.32,670/-
- ఫిజియోథెరపిస్ట్ – రూ.21,500/-
- ఇతర అన్ని పోస్టులకు – రూ.15,000/-
దరఖాస్తు విధానం:
AP DCHS Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడనాకి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. నింపిన అప్లికేషన్ తో అటెస్టెడ్ చేయించిన డాక్యుమెంట్స్ జత చేసి ‘డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, అనంతపురం జిల్లా కార్యాలయంలో మే 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 21- 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 – 05 – 2025
Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |