AP District Court Jobs Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్ .. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డు అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో మొత్తం 1620 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ పోస్టులు. ఈ ఉద్యోగాలకు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP District Court Jobs Notification 2025
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1620 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు తమ జిల్లాకు కేటాయించిన పోస్టుల వివరాలను ఆ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఇందులో జిల్లాల వారీగా పోస్టులు ఉంటాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 1,620
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ అసిస్టెంట్ | 230 |
ఆఫీస్ సబార్డినేట్ | 651 |
ప్రాసెస్ సర్వర్ | 164 |
రికార్డు అసిస్టెంట్ | 24 |
కాపీయిస్ట్ | 193 |
ఎగ్జామినర్ | 32 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 56 |
టైపిస్ట్ | 162 |
స్టెనోగ్రాఫర్ | 80 |
డ్రైవర్ | 28 |
అర్హతలు :
AP District Court Jobs Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. అభ్యర్థులు పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
పోస్టుల వారీగా విద్యార్హతలు :
పోస్టు పేరు | విద్యార్హతలు |
జూనియర్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ |
ఫీల్డ్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ |
ఆఫీస్ సబార్డినేట్ | 7వ తరగతి |
టైపిస్ట్ | ఏదైనా డిగ్రీ + టైపింగ్ |
స్టెనోగ్రాఫర్ | ఏదైనా డిగ్రీ + టైపింగ్ |
రికార్డ్ అసిస్టెంట్ | ఇంటర్మీడియట్ |
ప్రాసెస్ సర్వర్ | 10వ తరగతి |
ఎగ్జామినర్ | ఇంటర్మీడియట్ |
డ్రైవర్ | 7వ తరగతి |
కాపీయిస్ట్ | ఇంటర్మీడియట్ |
వయస్సు:
AP District Court Jobs Notification 2025 ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
AP District Court Jobs Notification 2025 ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే UR / BC / EWS అభ్యర్థులు రూ.800/- మరియు SC / ST / PH అభ్యర్థులు రూ.400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / BC / EWS | రూ.800/- |
SC / ST / PH | రూ.400/- |
ఎంపిక విధానం :
AP District Court Jobs Notification 2025 ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణలైన తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూకు పిలుస్తారు. టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
జీతం :
AP District Court Jobs Notification 2025 ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- పైగా జీతం ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
AP District Court Jobs Notification 2025 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లో పోస్టును బట్టి నోటిఫికేషన్లు ఇచ్చారు. అప్లయ్ చేసుకోవాల్సిన పోస్టుపై క్లిక్ చేసి అన్ని వివరాలు చూసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ్ మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 06 – 05 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 – 05 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 02 – 06 – 2025
Notification | CLICK HERE |