AP DSC 2025 Hall Tickets Download ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 30వ తేదీ రాత్రి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో జరుగుతాయి.
AP DSC 2025 Hall Tickets Download
రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 5.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఆన్ లైన్ పరీక్షల కోసం విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పరీక్ష కేంద్రాల ఎంపిక దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 40 వేల మంది పరీక్షలు రాసేటట్లు విద్యాశాఖ ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల కోసం డీఎస్సీ మాక్ టెస్టులు కూడా విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీను జూలై 8న విడుదల చేస్తారు. ఫలితాలు జూలై నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
How to Download AP DSC 2025 Hall Tickets
ఏపీ విద్యాశాఖ డీఎస్సీ హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. ఉంచుతుంది. అభ్యర్థులు కింది స్టెప్స్ అనుసరించి తమ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగలరు.
- అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో AP Mega DSC 2025 Hall Tickets ఆ ప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి..
- AP DSC 2025 Hall Tickets Download అవుతుంది.
- దానిని ప్రింట్ తీసుకొని పరీక్షకు హాజరుకాగలరు.
పరీక్షకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ :
AP DSC 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట కింది డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
- AP DSC 2025 Hall Ticket
- రెండు పాస్ పోస్ట్ సైజ్ ఫొటోలు
- ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు. ఆధార్ కార్డు / ఓటర్ కార్డు / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్