AP Endowment Department Jobs 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేశారు. దేవాదాయ శాఖలో గత రెండున్నర దశాబ్దాలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగలేదు. దీంతో ఆ శాఖలో అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం దేవాదాయ శాఖలో రెవెన్యూ అధికారులతో సర్దుబాటు చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఆలయాలు సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని చంద్రబాడు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో త్వరలోనే దేవాదాయ శాకలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
AP Endowment Department Jobs 2025
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలతో పాటు మరో 200 వైదిక సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 137
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డిప్యూటీ కమిషనర్ | 06 |
అసిస్టెంట్ కమిషనర్ | 05 |
గ్రేడ్ -1 ఈవో | 06 |
గ్రేడ్ -3 ఈవో | 104 |
జూనియర్ అసిస్టెంట్ | 16 |
ఈ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దేవాదాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇక ఈ ఉద్యోగాలతో పాటు మరో 200 వైదిక సిబ్బంది పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం తదితర వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తెలుస్తాయి.
Yes