AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కడప జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, వయస్సు, దరఖాస్తు విధానం తదితర వివరాలను పూర్తిగా చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
AP Outsourcing Jobs 2025
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్ కడప జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 19 కాంట్రాక్ట్ మరియు 50 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 69
కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు :
- అనస్థీషియా టెక్నీషియన్ : 04
- ఎమర్జెన్సీ మెడికట్ టెక్సీషియన్ : 06
- ల్యాబ్ టెక్సీషియన్ గ్రేడ్ -2 : 09
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ : 02
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : 02
- ఎలక్ట్రీషియన్ : 01
- జనరల్ డ్యూటీ అటెండెంట్ : 44
- ప్లంబర్ : 01
అర్హతలు :
AP Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
అనస్థీషియా టెక్నీషియన్ | సైన్స్ గ్రూపులతో ఇంటర్ + 2 సంవత్సరాల అనస్థీషియా టెక్నీషియన్ డిప్లొమా + ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ |
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ | BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ / BSc EMST |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 | DMLT / BSc (MLT) + ప్రభుత్వాస్పత్రిలో 1 సంవత్సరం అప్రెంటిస్ షిప్ + APPMBలో రిజిస్ట్రేషన్ |
జూనియర్ అసిస్టెంట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ | కంప్యూటర్ తో ఏదైనా డిగ్రీ / కంప్యూటర్ అప్లికేషన్స్ లో PG డిప్లొమా |
ఎలక్ట్రీషియన్ | ఎలక్ట్రికల్ లో ఐటీఐ + 1 సంవత్సరం అప్రెంటిస్ షిప్ |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 10వ తరగతి |
ప్లంబర్ | ఫిట్టర్ ట్రేడ్ లో ఐటీఐ + ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ |
వయస్సు:
AP Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
AP Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖస్తు చేసుకునే జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.400/- మరియు SC / ST / BC / EWS/ PwD అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాలి. ప్రిన్సిపాల్, గబర్నమెంట్ మెడికాల్ కాలేజీ, కడప పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక విధానం:
AP Outsourcing Jobs 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పోస్టులకు అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
- కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు రూ.32,670/- జీతం ఇస్తారు.
- జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఎలక్ట్రీషియన్ పోస్టులకు రూ.18,500/- జీతం చెల్లిస్తారు.
- జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు ప్లంబర్ పోస్టులకు రూ.15,000/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
- AP Outsourcing Jobs 2025 పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
- దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లు అధికారిక వెబ్ సైట్ లో మే 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకుని, అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- నింపిన అప్లికేషన్ ఫారమ్, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కడప అడ్రస్ లో సమర్పించాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- 10వ తరగతి సర్టిఫికెట్
- విద్యార్హత సర్టిఫికెట్లు
- APPMB రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (అవసరమైతే)
- 4 – 10 స్టడీ సర్టిఫికెట్
- కుల / ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ సర్టిఫికెట్ (అవసరమైతే)
- కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ సేవా సర్టిఫికెట్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 05 – 2025
- తాత్కాలిక మెరిట్ జాబితా : 18 – 06 – 2025
- తుది మెరిట్ జాబితా : 15 – 07 – 2025
- అపాయింట్మెంట్ ఆర్డర్స్ : 25 – 07 – 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |