BEL Recruitment 2025 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ సంస్థ అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో తోడ్పాటు కోసం BEL సాఫ్ట్ వేర్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ కోసం సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1, జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 మరియు ప్రొఫెషనల్స్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
BEL Recruitment 2025
పోస్టుల వివరాలు :
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశంలోని ఒక ప్రముఖ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి సాఫ్ట్ వేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సంస్థ పేరు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
- పోస్టు పేరు : సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ, జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్
- పోస్టుల సంఖ్య : 40
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 | 15 |
జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 | 15 |
సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ -1 | 10 |
అర్హతలు :
BEL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింది ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు మరియు అనుభవం |
సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ | MCA / MSc (Computers)అనుభవం: అవసరం లేదు. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. |
జూనియర్ సాప్ట్ వేర్ ట్రైనీ | BCA / BSc (Computers)అనుభవం: అవసరం లేదు. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. |
సాఫ్ట్ వేర్ ప్రొషెనల్స్ | కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్అనుభవం: సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ లో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. |
వయస్సు :
BEL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ : పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ : పోస్టులకు 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ : పోస్టులకు 40 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
BEL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు SC / ST / PwBD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
పోస్టు పేరు | కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ | UR / OBC / EWS | రూ.150 + జీఎస్టీ |
జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ | UR / OBC / EWS | రూ.100 + జీఎస్టీ |
సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ | UR / OBC / EWS | రూ.450 + జీఎస్టీ |
ఎంపిక ప్రక్రియ:
BEL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- సీనియర్ & జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ : పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
- సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ : పోస్టులకు 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థలకు ఇంటర్వ్యూ ఉంటుంది.
జీతం వివరాలు :
BEL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ ఆకర్షణీయమైన కన్సాలిడేటెడ్ జీతం ఇస్తుంది. మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
- సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 : నెలకు రూ.35,000/-
- జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 : నెలకు రూ.25,000/-
- సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ -1 : నెలకు రూ.60,000/-
దరఖాస్తు విధానం:
BEL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ లేదా జాబ్ నోటిఫికేషన్ విభాగంలో వెళ్లాలి.
- ఆన్ లైన్ అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత దరఖాస్తును సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూన్, 2025
Notification | Click here |
Apply Online | Click here |