BPCL Recruitment 2025 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్(అకౌంట్స్) మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BPCL Recruitment 2025
పోస్టుల వివరాలు :
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ తో సహా వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
అర్హతలు :
BPCL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) : మెకనికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా + 5 సంవత్సరాల అనుభవం
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్) : సంబంధిత విభాగాల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత + 3 సంవత్సరాల అనుభవం
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) : ఇంటర్ సీఏ లేదా ఇంటర్ సీఎంఏతో గ్రాడ్యుయేషన్ + 5 సంవత్సరాల అనుభవం
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(క్వాలిటీ) : ఆర్గానిక్ / ఇనార్గానిక్ / ఫిజికల్/ అనలిటికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ + 3సంవత్సరాల అనుభవం
- సెక్రటరీ : గ్రాడ్యుయేషన్ + 5 సంవత్సరాల అనుభవం
వయస్సు :
BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) పోస్టుకు మాత్రం కనిష్ట వయస్సు 30 సంవత్సరాలు – గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,180/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
BPCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులను ముందుగా అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- షార్ట్ లిస్ట్
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
BPCL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలను బట్టి జీతం ఉంటుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ : నెలకు రూ.30,000 – రూ.1,20,000/- (ఏడాది ప్యాకేజీ దాదాపు రూ.11.86 లక్షలు) ఉంటుంది.
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ : నెలకు రూ.40,000 – రూ.1,40,000/-(ఏడాది ప్యాకేజీ దాదాపు రూ.16.64 లక్షలు) ఉంటుంది.
దరఖాస్తు విధానం :
BPCL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో BPCL Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమై తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 మే, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 27 జూన్,2025
Notification | Click here |
Apply Online | Click here |