CBSL Recruitment 2025 కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్ షిప్ మేనేజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
CBSL Recruitment 2025 Overview :
నియామక సంస్థ | కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ |
పోస్టు పేరు | డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్ షిప్ మేనేజర్ ట్రైనీ |
పోస్టుల సంఖ్య | 25 |
దరఖాస్తులకు చివరి తేదీ | 31 జూలై, 2025 |
జాబ్ లొకేషన | భారతదేశం అంతటా |
పోస్టుల వివరాలు :
CBSL Recruitment 2025 కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి అధికారిక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్ షిప్ మేనేజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
CBSL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
CBSL Recruitment 2025 అభ్యర్థులకు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CBSL Recruitment 2025 అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
CBSL Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
CBSL Recruitment 2025 డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్ షిప్ మేనేజర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22,000/- జీతం చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా పర్మనెంట్ ఉద్యోగానికి అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
CBSL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ డ్రైవ్ వద్ద క్లిక్ హియర్ టు అప్లయ్ DPRM పోస్టు వద్ద క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అటాచ్ చేయాలి.
- ఒకవేళ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని కింది చిరునామాకు పంపాలి.
- చిరునామా: ది జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III నరిమాన్ పాయింట్, ముంబై – 400021
దరఖాస్తులకు చివరి తేదీ : 31.07.2025
Notification | Click here |
Apply Online | Click here |