CCI Recruitment 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 9వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
CCI Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఈ కొత్త నోటిఫికేషన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. చాలా రోజుల తర్వాత అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 147
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) | 10 |
మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) | 10 |
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ | 125 |
జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్) | 02 |
అర్హతలు :
CCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) | అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ సంబంధిత మేనేజ్మెంట్ లో MBA |
మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) | CA / CMA |
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ | BSC (Agriculture) |
జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్) | ఎలక్ట్రికల్స్/ ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా |
వయస్సు:
CCI Recruitment 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
CCI Recruitment 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,500/- మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / OBC / EWS | రూ.1,500/- |
SC / ST / PwBD / ExSM | రూ.500/- |
ఎంపిక ప్రక్రియ :
CCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష కోసం హైదరాబాద్ లో కూడా సెంటర్ కేటాయించారు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
CCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి జీతాలు వేర్వేరుగా ఉంటాయి. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- మేనేజ్మెంట్ ట్రైనీ : రూ.30,000 – రూ.1,20,000/-
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ : రూ.22,000 – రూ.90,000/-
- జూనియర్ అసిస్టెంట్ : రూ.22,000 – రూ.90,000/-
దరఖాస్తు విధానం :
CCI Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారమ్ ని సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |