CBI Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 4,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ్ జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు.
Central bank of India Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 4,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ అప్రెంటిస్ షిప్ ప్రోగ్రామ్ బ్యాంకింగ్ రంగంలో ఆచరణాత్మక శిక్షణను అందిస్తుంది.
- నియామక సంస్థ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- పోస్టు పేరు : అప్రెంటిస్
- పోస్టుల సంఖ్య : 4,500
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 128 పోస్టులు, తెలంగాణలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా అప్రెంటిస్ షిప్ చేయవచ్చు.
అర్హతలు:
CBI Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ + స్థానిక భాష
- అభ్యర్థులు జనవరి 1, 2021 లేదా ఆ తర్వాత తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
CBI Recruitment 2025 అభ్యర్థులకు మే 31, 2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CBI Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600/- మరియు దివ్యాంగ అభ్యర్థులకు రూ.400/- ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరీ | ఫీజు |
UR / OBC / EWS | రూ.800/- |
SC / ST / Women | రూ.600/- |
PwBD | రూ.400/- |
ఎంపిక ప్రక్రియ:
CBI Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్థానిక భాష పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
CBI Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు ఇతర అలవెన్సులు లేదా ప్రయోజనాలు ఉండవు.
- స్టైఫండ్ : నెలకు రూ.15,000/-
దరఖాస్తు విధానం :
CBI Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.
- అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
- పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ షిప్ పై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 7, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 23, 2025
- ఆన్ లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం) : జూలై 2025 మొదటి వారం
Notification | Click here |
Apply Online | Click here |