CSIR CFTRI Recruitment 2025 | ఫుడ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

By: Afzal

On: April 13, 2025

Follow Us:

CSIR CFTRI Recruitment 2025

CSIR CFTRI Recruitment 2025 : CSIR – సెంట్రల్ పుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేేదీ నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

CSIR CFTRI Recruitment 2025

పోస్టుల వివరాలు : 

సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్)04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేజ్)02
జూనియర్ స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్/హిందీ)06

అర్హతలు: 

CSIR CFTRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనో గ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఇతర అర్హతలు కూడా ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి
జూనియర్ స్టెనోగ్రాఫర్10+2 ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రాఫర్ స్కిల్ ఉండాలి. 

వయస్సు : 

CSIR CFTRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

CSIR CFTRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.500/- ఫీజు నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. 

కేటగిరిఫీజు
UR / EWS / OBCరూ.500/-
SC / ST / PwBD /Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR CFTRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • టైపింగ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం: 

CSIR CFTRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.36,220/- మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.47,415/- జీతాలు ఉంటాయి.  

పోస్టు పేరుజీతం
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్రూ.19,900 – రూ.63,200/-
జూనియర్ స్టెనోగ్రాఫర్రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం: 

CSIR CFTRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7వ తేేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ఫారమ్ జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం07 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ07 – 05 – 2025
పరీక్ష తేదీజూన్ / జూలై, 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment