CSIR IMTECH Recruitment 2025 : CSIR ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 07వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CSIR IMTECH Recruitment 2025 Overview:
నియామక సంస్థ | CSIR-ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ, చండీగఢ్ |
పోస్టు పేరు | జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ |
పోస్టుల సంఖ్య | 16 |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ |
దరఖాస్తులకు చివరి తేదీ | జూలై 07, 2025 |
పోస్టుల వివరాలు :
CSIR-ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ నుంచి జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 16 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 01 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 09 |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 06 |
విద్యార్హతలు :
CSIR IMTECH Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ / హిందీ తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా హిందీ / ఇంగ్లీష లో మాస్టర్స్ డిగ్రీ. ట్రాన్స్ లేషన్ లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ అవసరం.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ + కంప్యూటర్ లో ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఇంటర్మీడియట + ఇంగ్లీష్ / హిందీలో స్టెనోగ్రఫీ స్పీడ్ నిమిషానికి 80 పదాలు
వయస్సు :
CSIR IMTECH Recruitment 2025 పోస్టును బట్టి 27, 28, 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : 30 సంవత్సరాలు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 28 సంవత్సరాలు
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : 27 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
CSIR IMTECH Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- UR / OBC / EWS : రూ.500/-
- SC / ST / PwBD / Women : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
CSIR IMTECH Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టు పేరు | ఎంపిక్ర ప్రక్రియ |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | రాత పరీక్ష పేపర్-1 & పేపర్ 2 (అనువాదం మరియు భాషా ప్రావీణ్యం) |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | రాత పరీక్ష పేపర్-1(OMR) + పేపర్-2(టైపింగ్ టెస్ట్) |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | రాత పరీక్ష + స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ |
జీతం వివరాలు :
CSIR IMTECH Recruitment 2025 పోస్టులకు లెవల్-2, లెవల్-4, లెవల్-6 ప్రకారం జీతాలు చెల్లిస్తారు.
- JHT : ₹35,400 – ₹1,12,400/-
- JSA : ₹19,900 – ₹63,200/-
- JST : ₹25,500 – ₹81,100/-
దరఖాస్తు విధానం :
CSIR IMTECH Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ‘రిక్రూట్మెంట్’ విభాగంలో ‘అప్లయ్ ఆన్ లైన్’ పై క్లిక్ చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 07 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |