DRDO JRF Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలు మే 6వ మరియు 7వ తేదీల్లో జరుగుతాయి. DRDO JRF పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
DRDO JRF Recruitment 2025
పోస్టుల వివరాలు :
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 12 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా పోస్టుల వివరాలు కింద చూడవచ్చు.
పోస్టు పేరు | ఖాళీలు |
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | 03 |
ఫిజిక్స్ / జియోఫిజిక్స్ | 02 |
ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ | 01 |
రిమోట్ సెన్సింగ్ & GIS | 03 |
డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ | 01 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 02 |
అర్హతలు :
DRDO JRF Recruitment 2025 పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ : ME / M.Tech / BE / B.Tech / MSc(కంప్యూటర్ సైన్స్) తో పాటు NET / GATE
- ఫిజిక్స్ / జియోఫిజిక్స్ : MSc ( ఫిజిక్స్ / జియోఫిజిక్స్) తో పాటు NET / GATE
- ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ : MSc ( ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్) తో పాటు NET / GATE
- రిమోట్ సెన్సింగ్ & GIS : ME / M.Tech / MSc / BE / B.Tech (రిమోట్ సెన్సింగ్ & GIS) తో పాటు NET / GATE
- డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ : ME / M.Tech / BE / B.Tech (మెకానికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్) తో పాటు NET / GATE
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : ME / M.Tech / BE / B.Tech (ECE / ఇన్ స్ట్రుమెంటేషన్) తో పాటు NET / GATE
వయస్సు:
DRDO JRF Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
జీతం :
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000/- + HRA ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
- ఇంటర్వ్యూ రోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకువెళ్లాలి.
- ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే NOC సర్టిఫికెట్ తీసుకురావాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- 10వ తరగతి నుంచి సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్లు
- కుల సర్టిఫికెట్ (అవసరమైతే)
- NET / GATE స్కోర్ కార్డు
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (ఒకవేళ ఉంటే)
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే NOC సర్టిఫికెట్
ఇంటర్వ్యూ ప్రదేశం :
డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, హిమ్ పరిసార్, ప్లాట్ నెం -01, సెక్టార్ 37A, చండీగఢ్ – 160036
ఇంటర్వ్యూ తేదీలు :
పోస్టు పేరు | ఇంటర్వ్యూ తేదీ |
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | మే 6, 2025 |
ఫిజిక్స్ / జియోఫిజిక్స్ | మే 6, 2025 |
ఎన్వారాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ | మే 6, 2025 |
రిమోట్ సెన్సింగ్ & GIS | మే 7, 2025 |
డిజైన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ | మే 7, 2025 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | మే 7, 2025 |
Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |