ECIL Apprentice Recruitment 2025 హైదరాబాద్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ITI Trade Apprentices పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 412 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్ ట్రైనింగ్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ECIL Apprentice Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
సంస్థ | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) |
నోటిఫికేషన్ నం. | 16/2025 |
పోస్టు పేరు | ITI ట్రేడ్ అప్రెంటీస్ |
మొత్తం ఖాళీలు | 412 |
శిక్షణ కాలం | 1 సంవత్సరం (01 నవంబర్ 2025 నుండి) |
వయోపరిమితి | 18 – 25 |
అర్హత | ITI పాస్ (NCVT సర్టిఫికేట్) |
ఎంపిక విధానం | ITI మార్కుల ఆధారంగా మెరిట్ |
దరఖాస్తు ప్రారంభం | 01 సెప్టెంబర్ 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 22 సెప్టెంబర్ 2025 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ | 07 – 09 అక్టోబర్ 2025 |
ఆఫర్ లెటర్స్ | 15 – 16 అక్టోబర్ 2025 |
Apprenticeship ప్రారంభం | 01 నవంబర్ 2025 |
అధికారిక వెబ్సైట్ | www.ecil.co.in |
ఖాళీల వివరాలు
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 412 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ట్రేడ్ పేరు | ఖాళీలు |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 95 |
ఫిట్టర్ | 130 |
ఎలక్ట్రీషియన్ | 61 |
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) | 51 |
మెకానిక్ (AC & Refrigeration) | 3 |
టర్నర్ | 15 |
వెల్డర్ | 22 |
మిషినిస్ట్ | 12 |
మిషినిస్ట్ (Grinder) | 2 |
పెయింటర్ | 9 |
కార్పెంటర్ | 6 |
ప్లంబర్ | 3 |
మెకానిక్ డ్రాఫ్ట్స్మన్ | 3 |
మొత్తం | 412 |
- వీటిలో 16 ఖాళీలు PwD అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.
Also Read : Supreme Court Recruitment 2025 | రూ.90 వేల జీతంతో కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేయండి
అర్హతలు
ECIL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఐటీఐ ట్రేడ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
- ITI పాస్ సర్టిఫికేట్ (NCVT) సంబంధిత ట్రేడ్లో ఉండాలి.
- ప్రభుత్వ ITI అభ్యర్థులకు 70% సీట్లు, ప్రైవేట్ ITI అభ్యర్థులకు 30% సీట్లు కేటాయిస్తారు.
- హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి
ECIL Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- జనరల్ : 25 సంవత్సరాలు ఉండాలి.
- OBC : 28 సంవత్సరాలు ఉండాలి.
- SC/ST : 30 సంవత్సరాలు ఉండాలి.
- PwD అభ్యర్థులకు : అదనంగా 10 సంవత్సరాల సడలింపు
అప్లికేషన్ ఫీజు
ECIL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..
ఎంపిక ప్రక్రియ:
ECIL Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్టైపెండ్ (జీతం):
ECIL Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు Apprenticeship సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన విధంగా స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయ్యాక National Apprenticeship Certificate (NAC) ఇవ్వబడుతుంది. ECIL Apprenticeship Training తరువాత ఉద్యోగ హామీ ఉండదు.

Also Read : NHPC 2025 Notification | Salary ₹1.4 Lakh వరకు | వెంటనే అప్లై చేయండి
దరఖాస్తు విధానం
ECIL Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు మొదట www.apprenticeshipindia.gov.in పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి.
- తరువాత www.ecil.co.in → Careers → Current Job Openings లోకి వెళ్లి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత Application Number తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అసలు సర్టిఫికేట్లు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 సెప్టెంబర్, 2025
Notification | Click here |
NAPS Portal | Click here |
Apply online | Click here |