Ap New Rice Card:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరైతే బీపీఎల్ కేటగిరిలో ఉన్నారో వారందరికీ ఈ రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. దాదాపు కోటి యాభై లక్షలకు పైగా రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందులో భాగంగా క్యూఆర్ కోడ్ తో జనవరి నెలాఖరుకు గాని, ఫిబ్రవరి తొలి వారంలో గాని కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది.
అసలు మీకు కొత్త రేషన్ కార్డు రావాలంటే కచ్చితంగా రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జియో ట్యాగింగ్, రెండోది మ్యాపింగ్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటికి చివరి తేదీలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తేదీలు ఏంటీ, అలాగే కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
HouseHold Geotagging :
ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రతి ఇంటిని జియో కోఆర్డినేట్స్ మీ హౌస్ ని జియో ట్యాగింగ్ చేస్తారు. కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే ఈ జియో ట్యాగింగ్ చేయాలి. వాళ్లకు మాత్రమే ఎంప్లాయి మొబైల అప్లికేషన్ అని ఒక యాప్ ఉంది. గత రెండు నెలల నుంచి సచివాలయ సిబ్బంది మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది మ్యాపింగ్ లో లేరు. మీరు మ్యాపింగ్ లో ఉన్నారో లేదో దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి తెలుసుకోవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే.. మ్యాపింగ్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే రేషన్ కార్డులో వస్తారు. మీ పిల్లలు కూడా రావాలంటే కచ్చితంగా మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. మిస్సింగ్ సిటిజన్స్ అని ఓపెన్ పోర్టల్ ఇచ్చారు. కింద్ ఉన్న లింక్ క్లిక్ చేేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని చెక్ చేసుకోండి..
Link for self enrollment in household:
కొత్త క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డు రావాలంటే కచ్చితంగా జియో లోకేషన్ ఉండాలి ఎందుకంటే జియో లొకేషన్ మరియు మ్యాపింగ్ రెండు కూడా ఒకే సచివాలయం పరిధిలో ఉండాలి. చాలా మంది ఏమో జియో లొకేషన్ ఒక చోట, మ్యాపింగ్ మరొక చోట చేసుకుంటారు. ఈ రెండు కూడా పొరపాటు. జియో ట్యాగింగ్ కేవలం ఈ నెల 20 మాత్రమే ఉంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వచ్చేసి ఈనెల 31 వరకు ఉంది. ఈ రెండు కూడా మీరు కచ్చితంగా చేసుకోవాలి. మీకు కొత్త రేషన్ కార్డు రావాలంటే ఈ రెండు చేసి ఉండాలి.
ఉదాహరణకు మీ కుటుంబంలో మీరు మీ పిల్లలు కలిపి ఐదుగురు ఉన్నారు అనుకోండి. ఐదుగురు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. అందరికీ ఆధార్ కార్డులు ఉండాలి. క్యాస్ట్, ఇన్ కమ్ అన్ని ఉండాలి. కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు మార్పుల చేర్పులు కూడా చేస్తారు. కొత్త రేషన్ కార్డు కోసం వెళ్లేటప్పుడు మీరు ఫుల్ గా మ్యాపింగ్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు అప్లికేషన్ తీసుకెళ్తే.. అక్కడ మీకు ఐదు నిమిషాల్లోనే కొత్త రేషన్ కార్డు అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో ప్రతి ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. అందరికీ ఒకే నెంబర్ కూడా ఇవ్వొచ్చు. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండకపోతే వెంటనే ఆధార్ సెంటర్ కి వెళ్లి లింక్ చేసుకోండి.