How to download ration card online?Full information in 2025

By: Afzal

On: January 13, 2025

Follow Us:

How to download ration card online?Full information in 2025

రేషన్ కార్డు ఆన్ లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేయాలి?

ప్రభుత్వాలు మారినప్పుడు మన రేషన్ కార్డులు కూడా మారుతూ ఉంటాయి. గతంలో చంద్రబాబు బొమ్మతో ఉన్న రేషన్ కార్డులను గత వైసీపీ ప్రభుత్వం మార్చేసింది. రేషన్ కార్డుల్లో మాజీ సీఎం ఫొటోను అయితే పెట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రేషన్ కార్డులు కూడా మారుతాయి. రేషన్ కార్డుల్లో జగన్ ఫొటోను తొలగించి చంద్రబాబు ఫొటోను అయితే పెట్టబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులను సంక్రాంతికి అయితే ఇస్తామని ప్రకటించారు.. కానీ పర్టికులర్ తేదీ అయితే చెప్పలేదు. 

కాకపోతే ఇప్పుడు రేషన్ కార్డు అనేది ఏదైన అర్జెంట్ గా డాక్యుమెంట్ గా కావాలంటే, లేదా విద్యార్థులు ఏమైన కాలేజీలో ఇవ్వాలన్నా, స్కాలర్ షిప్ కి అప్లయ్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అయితే కావాలి. ఇకపోతే మనకు పాత రేషన్ కార్డులు ఉంటాయో అందులో నెంబర్స్ ఉంటాయో.. అదే నెంబర్స్ కి సంబంధించిన రేషన్ కార్డు మనకు ఎప్పటికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. పాత రేషన్ కార్డును ఆన్ లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎలా డౌన్ లోడ్ చేయాలి?

ఈ రేషన్ కార్డును మనం రెండు పద్ధతులలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒక పద్ధతి వచ్చేసి డిజి లాకర్ అంటే యాప్ లో డౌన్ లోడ్ చేయవచ్చు. మరొక పద్ధతి వచ్చేసి వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మనకు యాప్ ఎందుకు సింపుల్ గా గూగుల్ లో డౌన్ లోడ్ చేసుకుంటాము అంటే.. డిజి లాకర్ వెబ్ సైట్ లో అయితే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

యాప్ లో డౌన్ లోడ్ : 

ముందుగా మన మొబైల్ లో DigiLocker యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేస్తేనే Get tarted పై క్లిక్ చేయాలి. ఇందులో మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి.. ఉంటే సైన్ ఇన్ పై క్లిక్ చేసి ఎంటర్ అవ్వండి. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు గానీ.. ప్రతి ఒక్కటి మాన ఆధార్ కి లింక్ అయి ఉన్న సర్టిఫికెట్లు అన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఎక్కడికైన వెళ్లారు..అర్జెంటుగా పాన్ కార్డు అవసరం పడింది.. ఈ డిజిలాకర్ యాప్ ద్వారా పీడీఎఫ్ లో మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

DigiLocker అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా? 

DigiLocker లో మీకు అకౌంట్ లేకపోతే సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అలాగే ఒక పిన్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటిపి ఎంటర్ చేస్తే అకౌంట్ లాగిన్ అవుతుంది. 

ఈ యాప్ లో లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ద్వారా లేక ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలా అని అడుగుతుంది. మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ‘నెక్ట్స్’ అని క్లిక్ చేస్తే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ వెబ్ సైట్ అనేది వెరిఫై చేసుకుంటుంది. అనంతరం మన జనరేట్ చేసుకన్న పిన్ అయితే ఎంటర్ చేయాలి. అక్కడి నుంచి మనం ప్రతి సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

మనం రేషన్ కార్డు కోసం వెతుకుతున్నాం కాబట్టి.. యాప్ లో కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ రేషన్ కార్డు అనే కొడితే రాష్ట్రాలు చూపిస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని ఎంచుకుంటే.. పేరు, రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. గతంలో ఇచ్చిన పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి Get Document పై క్లిక్ చేస్తే రేషన్ కార్డు అనేది డౌన్ లోడ్ అవుతుంది. ఈ విధంగా మనమే మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాని ప్రతి సర్వీస్ అనేది డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment