IAF AFCAT 02/2025 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 284 ఆఫీసర్ ఉద్యోగాలు

By: Afzal

On: June 2, 2025

Follow Us:

IAF AFCAT 02/2025 Notification

IAF AFCAT 02/2025 Notification ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ( AFCAT 02/2025) నోటిఫికేషన్ విడుదలైంది. NCC స్పెషల్ ఎంట్రీతో సహా ఫ్లయింగ్ బ్రాంచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) శాఖల్లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IAF AFCAT 02/2025 Notification

పోస్టుల వివరాలు : 

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 02/2025 కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్లయింగ్ బ్రాంచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) డిపార్ట్మెంట్ లో కమిషన్డ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ పోర్స్ 
  • మొత్తం పోస్టుల సంఖ్య : 284
పోస్టు పేరుఖాళీల సంఖ్య
ఫ్లయింగ్ బ్రాంచ్03
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)156
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)125

అర్హతలు : 

IAF AFCAT 02/2025 Notification ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాల కింద ఇవ్వబడ్డాయి. 

ఫ్లయింగ్ బ్రాంచ్ : ఇంటర్ లో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)

  • ఏరోనాటికల్ ఇంజనీర (ఎలక్ట్రానిక్స్ ): ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటజినీరింగ్ / టెక్నాలజీలో నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ / ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 
  • ఏరోనాటికల్ ఇంజనీర్ (మెకానికల్) : ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఇంజనీరింగ్ / టెక్నాలజీలో నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ 

గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) : సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు : 

  • ఫయింగ్ బ్రాంచ్ :  పోస్టులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) : పోస్టులకు 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  

దరఖాస్తు ఫీజు : 

IAF AFCAT 02/2025 Notification పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.550/- + జీఎస్టీ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

IAF AFCAT 02/2025 Notification పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • ఆన్ లైన్ AFCAT పరీక్ష
  • ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్

పే స్కేల్ వివరాలు : 

IAF AFCAT 02/2025 Notification పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- జీతం చెల్లించడం జరుగుతుంది. ఫ్లైట్ క్యాడెట్లకు ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.56,100/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు ప్రక్రియ: 

IAF AFCAT 02/2025 Notification పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. 
  • ఆన్ లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి.
  • అనంతరం కచ్చితమైన వివరాలతో ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి. 
  • పూర్తి చేసిన అప్లికేసన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 02 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 01- 07 – 2025 
NotificationClick here
Apply onlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment