IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి మే 8వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
IDBI JAM Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
- మొత్తం పోస్టుల సంఖ్య : 676
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు :
కేటగిరి | ఖాళీల సంఖ్య |
జనరల్ | 271 |
EWS | 67 |
OBC | 124 |
SC | 140 |
ST | 74 |
అర్హతలు :
IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IDBI JAM Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింది విధంగా ఉన్నాయి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / OBC / EWS | ₹1,050/- |
SC / ST / PwD | ₹250/- |
ఎంపిక ప్రక్రియ:
IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 2 గంటల సమయం కేటాయిస్తారు. 1/4వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ – 60 ప్రశ్నలు
- ఇంగ్లీస్ లాంగ్వేజ్ – 40 ప్రశ్నలు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 40 ప్రశ్నలు
- జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవగాహన – 60 ప్రశ్నలు
జీతం వివరాలు :
IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం రూ.50,000/- పైగానే ఉంటుంది.
దరఖాస్తు విధానం :
IDBI JAM Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అక్కడ కెరీర్ ఆప్షన్ లోకి వెళ్లాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమై తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 08 – 05 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 20 – 05 – 2025 |
పరీక్ష లేదీ | 08 – 06 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |