Indian Army SSC(Tech) Recruitment 2025 ఇండియన్ ఆర్మీ 66వ SSC టెక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ పోస్టుల కోసం ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ వరకు ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
Indian Army SSC(Tech) Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ఇండియన్ ఆర్మీ |
పోస్టు పేరు | షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్(SSC Tech) |
పోస్టుల సంఖ్య | ప్రకటించలేదు |
జాబ్ లొకేషన్ | ఇండియాలో ఎక్కడైనా |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 16 జులై – 14 ఆగస్టు, 2025 |

పోస్టుల వివరాలు :
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన టెక్నికల్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ కోర్సు ఏప్రిల్, 2026లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభమవుతుంది. పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
- కోర్సు పేరు : 66వ SSC(Tech) పురుషులు మరియు మహిళలు
- పోస్టు పేరు : SSC టెక్నికల్ ఆఫీసర్స్ (లెఫ్టినెంట్)
అర్హతలు :
Indian Army SSC(Tech) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- SSC(Tech) : ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
Indian Army SSC(Tech) Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఆర్మీ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
Indian Army SSC(Tech) Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది.
- దరఖాస్తు పరిశీలన
- సర్వీస్ సెలక్షన్ బోర్డు(SSB) ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
దరఖాస్తు విధానం :
Indian Army SSC(Tech) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 16.07.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14.08.2025
Official Website | Click here |