Indian Coast Guard Recruitment 2025 ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Indian Coast Guard Recruitment 2025 Overview :
సంస్థ పేరు | ఇండియన్ కోస్ట్ గార్డ్ |
పోస్టు పేరు | నావిక్ మరియు యాంత్రిక్ |
పోస్టుల సంఖ్య | 630 |
జాబ్ లొకేషన్ | భారతదేశం అంతట |
దరఖాస్తులకు చివరి తేదీ | జూన్ 25, 2025 |
ఖాళీల వివరాలు :
ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నావిక్ మరియు యాంత్రిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి బ్యాచ్‌కు కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వబడింది.
CGEPT – 01/26 batch :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
నావిక్ (జనరల్ డ్యూటీ) | 260 |
యాంత్రిక్ (మెకానికల్) | 30 |
యాంత్రిక్ (ఎలక్ట్రికల్) | 11 |
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) | 19 |
CGEPT – 02/26 batch :
నావిక్ (జనరల్ డ్యూటీ) | 260 |
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) | 50 |
అర్హతలు :
Indian Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ ఉద్యోగాలకు పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి మరియు డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు | విద్యార్హతలు |
నావిక్ (జనరల్ డ్యూటీ) | మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత |
యాంత్రిక్ (మెకానికల్) | 10వ తరగతి ఉత్తీర్ణత + మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా |
యాంత్రిక్ (ఎలక్ట్రికల్) | 10వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా |
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) | 10వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రానిక్స్ / టెలికాం ఇంజనీరింగ్ లో డిప్లొమా |
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) | 10వ తరగతి |
వయస్సు :
Indian Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Indian Coast Guard Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ | రూ.300/- |
ఎస్సీ / ఎస్టీ | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
Indian Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3 మరియు స్టేజ్-4 దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టేజ్ | ఎంపిక వివరాలు |
స్టేజ్-1 | కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు బయోమెట్రిక్ రికార్డింగ్ |
స్జేజ్-2 | బేసిక్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, అసిస్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫకేషన్ |
స్టేజ్-3 | INS చిల్కాలో బేసిక్ ఐడెంటిటీ చెకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ-ఎన్రోల్మెంట్ మెడికల్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ |
స్టేజ్-4 | ఒరిజనల్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ మరియు వెరిఫికేషన్ |
జీతం వివరాలు :
Indian Coast Guard Recruitment 2025 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు సంబంధించి జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- నావిక్ (జనరల్ డ్యూటీ) : బేసిక్ పే రూ.21,700/- + ఇతర అలవెన్సులు
- యాంత్రిక్ పోస్టులకు : బేసిక్ పే రూ.29,200/- + ఇతర అలవెన్సులు
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) : బేసిక్ పే రూ.21,700/- + ఇతర అలవెన్సులు
దరఖాస్తు విధానం :
Indian Coast Guard Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది.
- అభ్యర్థులు క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అనంతరం దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 11 జూన్, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 25 జూన్, 2025 |
Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |