Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 | ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

By: Afzal

On: June 12, 2025

Follow Us:

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 ఇండియన్ నేవీలో 2026 కోర్సులో చేరడానికి 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫిజిక్స్ , కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పూర్తి చేసి JEE(మెయిన్) 2025 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. ఈ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లో జాయిన్ అయిన వారు 4 సంవత్సరాల బీటెక్ డిగ్రీ పూర్తి చేయడంతో పాటు ఇండియన నేవీలో ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ లలో కమిషన్డ ఆఫీసర్ గా ఎంపిక చేయబడతారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జూలై 14వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 Overview : 

నియామక సంస్థఇండియన్ నేవీ
పోస్టు పేరు10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
పోస్టుల సంఖ్య44
జాబ్ లొకేషన్ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల(ట్రైనింగ్ కోసం), మరియు భారతదేశం అంతటా ఉన్న వివిధ నావెల్ బేస్ లు
కోర్సు ప్రారంభంజనవరి 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ నేవీ జనవరి 2026 కోర్సు కోసం 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ లలో మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ నేవీ పర్మినెంట్ కమిషన్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియామకాలను చేపడుతుంది. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో నాలుగు సంవత్సరాల పాటు కఠినమైన బీటెక్ కోర్సు చేయాల్సి ఉంటుంది. బీటెక్ కోర్సు పూర్తి అయిన తర్వాత సంబంధిత బ్రాంచ్ లలో కమిషన్డ్ ఆఫీసర్ గా పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. 

బ్రాంచ్ఖాళీల సంఖ్య
ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్44 (వీటిలో మహిళలకు 6 ఉన్నాయి)

అర్హతలు : 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కనీసం 70 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

  • 10+2 ఉత్తీర్ణత
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 70 శాతం మార్కులు
  • ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులు 
  • JEE(Mains)-2025 పరీక్షకు తప్పనిసరిగా హాజరై ఉండాలి

వయస్సు : 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 అభ్యర్థులు 02 జూలై, 2006 మరియు 01 జనవరి,2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. (రెండు తేదీలు కలుపుకుని).

అప్లికేషన్ ఫీజు : 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక  ప్రక్రియ జరుగుతుంది. 

  • షార్ట్ లిస్టింగ్
  • సర్వీస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్
  • ఫైనల్ మెరిట్ లిస్ట్

జీతం మరియు స్టైఫండ్ వివరాలు : 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 ఇండియన్ నావల్ అకాడమీలో క్యాడెట్ గా ఎంపికైన వారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత క్యాడెట్లను సబ్ – లెఫ్టినెంట్ గా నియమిస్తారు. వీరికి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ లెవల్-10 ప్రకారం రూ.56,100 నుంచి రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్సులు అన్ని ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ని నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ30 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ14 జూలై, 2025
SSB ఇంటర్వ్యూ తేదీలుసెప్టెంబర్ 2025 నుంచి
కోర్సు ప్రారంభంజనవరి 2026
NotificationClick here
Apply LinkClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment