Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టును భర్తీ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 17వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Indian Navy Sailor Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ నేవీలో స్పోర్ట్స్ కోటా కింది సెయిలర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇది సాధారణ రిక్రూట్మెంట్ అగ్నిపథ్ కిందికి రాదు. పురుష అభ్యర్థులు మరియు మహిళ అభ్యర్థులు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ ఎంట్రీ పెట్టి ఆఫీసర్ మరియు డైరెక్ట్ ఎంట్రీ చీఫ్ పెట్టి ఆఫీసర్ ఉద్యోగాలను నియమిస్తున్నారు. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని నోటిఫికేషన్ లో ప్రస్తావించబడలేదు.
- సంస్థ పేరు : ఇండియన్ నేవీ
- పోస్టు పేరు : సెయిలర్స్(డెరెక్ట్ ఎంట్రీ పెట్టి ఆపీసర్ మరియు డైరెక్ట్ ఎంట్రీ చీఫ్ పెట్టి ఆఫీసర్)
- ఉద్యోగ స్థానం : భారతదేశం అంతా
- పోస్టుల సంఖ్య : ప్రస్తావించబడలేదు
అర్హతలు :
Indian Navy Sailor Recruitment 2025 సెయిలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. మరియు అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పురుష అభ్యర్థులకు మరియ మహిళ అభ్యర్థులకు ఏ క్రిడల్లో సర్టిఫికెట్ ఉండాలి అనే వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయస్సు:
Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీలో సెయిలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2000 నుంచి ఫిబ్రవరి 29, 2008 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీలో సెయిలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Navy Sailor Recruitment 2025 సెయిలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంద. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ట్రయల్స్ కి పిలుస్తారు. ట్రయల్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులక మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది.
అభ్యర్థుల ఎత్తు:
- పురుషులు : 157 సెం.మీ
- మహిళలు : 152 సె.మీ
జీతం వివరాలు :
Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీలో సెయిలర్స్ గా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో రూ.14,600/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ తర్వాత పెట్టి ఆపీసర్ కి లెవల్-5 మరియు చీఫ్ పెట్టి ఆఫీసర్ కి లెవల్-6 ప్రకారం జీతం ఇస్తారు. దీంతో పాటు మిలిటరీ సర్వీస్ పే రూ.5,200/- మరియు డియర్నెస్ అలవెన్స్ అందుకుంటారు.
- శిక్షణ సమయంలో రూ.14,600/- స్టైఫండ్
- శిక్షణ తర్వాత :
- పెట్టి ఆఫీసర్ : లెవల్-5
- చీఫ్ పెట్టి ఆఫీసర్ : లెవల్ – 6
దరఖాస్తు విధానం :
Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీలో సెయిలర్స్ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు జత చేయాలి..
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని నిర్ణీత గడువులోపు కింది చిరునామాకు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా :
ది సెక్రటరీ ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, నావల్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నౌసేనా భవన్, రూమ్ నెంబర్ W-16, ఢిల్లీ కాంట్, న్యూఢిల్లీ – 110010
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 23 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 06 – 2025
Notification & Application | Click here |
Official Website | Click here |