ISRO ICRB Recruitment 2025 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 16వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు.
ISRO ICRB Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 320 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- సంస్థ పేరు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
- పోస్టు పేరు : సైంటిస్ట్ / ఇంజనీర్
- పోస్టుల సంఖ్య : 320
సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ విభాగాల వారీగా ఖాళీలు:
విభాగాలు | ఖాళీలు |
ఎలక్ట్రానిక్స్ | 113 |
మెకానికల్ | 160 |
కంప్యూటర్ సైన్స్ | 44 |
ఎలక్ట్రానిక్స్ – పీఆర్ఎల్ | 02 |
కంప్యూటర్ సైన్స్ – పీఆర్ఎల్ | 01 |
అర్హతలు :
ISRO ICRB Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ / బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 2024-25 విద్యాసంవత్సరంలో బీఈ/బీటెక్ పూర్తి చేయబోతున్న అభ్యర్థులు కూడా దరఖస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
ISRO ICRB Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
ISRO ICRB Recruitment 2025 అన్ని పోస్టులకు అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో దరఖాస్తుకు రూ.750/- చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రీఫండ్ చేయడం జరుగుతుంది.
- SC / ST / PwBD / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పూర్తి ఫీజు అంటే రూ.750/- రీఫండ్ చేయడం జరుగుతుంది.
- మిగితా అభ్యర్థులకు రూ.500/- రీఫండ్ చేయడం జరుగుతుంది.
- అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకాకపోతే ఫీజు రీఫండ్ చేయబడదు.
ఎంపిక ప్రక్రియ:
ISRO ICRB Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష : ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష రెండు భాగాల్లో ఉంటుంది. పార్ట్-ఎ 80 మార్కులకు, పార్ట్-బి 20 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది.
- ఇంటర్వ్యూ : రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో కనీసం 10 మంది అభ్యర్థులతో ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఫైనల్ ప్యానల్ : చివరి ప్యానల్ లో 50శాతం వెయిటేజీ రాత పరీక్షకు మరియు 50 శాతం వెయిటేజీ ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు :
ISRO ICRB Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్-10 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. అభ్యర్థులకు బేసిక్ పే రూ.56,100/- ఉంటుంది. దీంతో పాటు డియర్నెస్ అలవెన్స్(DA) , ఇంటి అద్దె అలవెన్స్ (HRA) మరియు ట్రావెలింగ్ అవలెన్స్(TA) చెల్లించడం జరుగుతుంది.
- బేసిక్ పే రూ.56,100/- + DA + HRA + TA
దరఖాస్తు విధానం :
ISRO ICRB Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 27 / 05 / 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 / 06 / 2025
Notification | Click here |
Apply Online | Click here |