విద్యాశాఖలో ఉద్యోగాలు నోటిఫికేషన్ వెల్లడైంది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు 14.02.2025 చివరి తేదీగా నిర్ణయించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరీ ఈ ఉద్యోగానికి అర్హతలు ఏంటీ, ఎలా ఎంపిక చేస్తారు, ఎలా అప్లయ్ చేేయాలని అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
NIEPA Recruitment 2025:
పోస్టుల వివరాలు :
NIEPA Recruitment 2025 లో లోయర్ డివిజన్ క్లర్క్(LDC) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి.
జీతం :
NIEPA లోయర్ డివిజన్ క్లర్క్ లో ఉద్యోగాల్లో ఎంపిక అయితే జీతం వచ్చేసి రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. అంటే మనం జాయిన్ అయితే అన్ని అలవెన్స్ లు కలుపుకుని రూ.35,000 చేతికి అయితే వస్తుంది.
విద్యార్హతలు :
NIEPA లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి అప్లయ్ చేసేందుకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ 35 W.P.M, హిందీ టైపింగ్ 30 W.P.M ఉండాలి.
వయస్సు :
NIEPA లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టేందుకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. 27 సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లికేషన్ పెట్టవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష వచ్చే ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. టైపింగ్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీదే నిర్వహిస్తారు.
పరీక్ష ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లయి చేయాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వారికి అయితే రూ.500 ఫీజు ఉంటుంది.
ఎలా అప్లయ్ చేయాలి:
NIEPA Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 14 ఫిబ్రవరి 2025 లోపు ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి. ఈ కింద లింక్ క్లిక్ చేసి NIEPA లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి.
Apply Online : CLICK HERE