NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుజరాత్ సైట్ లో ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ / స్టైపెండియరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NPCIL Recruitment 2025
పోస్టుల వివరాలు :
గుజరాత్ లోని కాక్రాపర్ సైట్ లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ / స్టైపెండియరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సైంటిఫిక్ అసిస్టెంట్ ( డిప్లొమా మరియు సైన్స్ గ్రాడ్యుయేట్) | 11 |
సైంటిఫిక్ అసిస్టెంట్ (ప్లాంట్ ఆపరేటర్ మరియు మెయింటెయినర్) | 166 |
అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్) | 09 |
అసిస్టెంట్ గ్రేడ్-1 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) | 06 |
అసిస్టెంట్ గ్రేడ్ -1 (C&MM) | 05 |
అర్హతలు :
NPCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ / బీఎస్సీ / డిప్లొమా / ఐటీఐ / 12వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి.
వయస్సు:
NPCIL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు
- స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 24 సంవత్సరాలు
- అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు 21 నుంచి 28 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ:
NPCIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
దరఖాస్తు విధానం:
NPCIL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు గమనించి అధికారిక నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 06 – 2025
Short Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |