రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో MTS ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు.. మరీ ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Railway DFCCIL Recruitment 2025
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటడ్(DFCCIL) నుండి ఈ నోటిఫికేషన్ అయిన విడుదలైంది. మొత్తం 642 పోస్టులు ఉన్నాయి. ఇందులో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, MTS పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18-01-2025 నుంచి 16-02-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరీ ఈ ఉద్యోగాల కోసం విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి వివరాలను ఇప్పుడు చూద్దాం..
DFCCIL Notification 2025
మొత్తం పోస్టుల సంఖ్య : 642
పోస్టుల వివరాలు:
జూనియర్ మేనేజర్ : DFCCIL Notification 2025 కి సంబంధించి జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులు 03 ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఒక పోస్టు.. ఓబీసీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్(సివిల్) : ఎగ్జిక్యూటివ్ (సివిల్) పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు చూస్తే.. జనరల్ విభాగంలో 16, ఈడబ్ల్యూఎస్ -3, ఓబీసీ-09, ఎస్సీ-05, ఎస్టీ-03 పోస్టులు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్) : ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్) విభాగంలో మొత్తం 64 పోస్టులు ఉన్నాయి. జనరల్ -28, ఈడబ్ల్యూఎస్-6, ఓబీసీ-14, ఎస్సీ-11, ఎస్టీ-5 పోస్టులు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్(సిగ్నల్ &టెలికమ్యూనికేషన్) : ఈ విభాగంలో మొత్తం 75 పోస్టులు ఉన్నాయి. జనరల్-28, ఈడబ్ల్యూఎస్-08, ఓబీసీ-23, ఎస్సీ-09, ఎస్టీ-07 పోస్టులు ఉన్నాయి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ Railway MTS Jobs 2025 :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ Railway MTS Jobs 2025 విభాగంలో మొత్తం 464 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల రిజర్వేషన్లు చూస్తే..
జనరల్ – 194 పోస్టులు
ఈడబ్ల్యూఎస్- 64 పోస్టులు
ఓబీసీ- 122 పోస్టులు
ఎస్సీ- 70 పోస్టులు
ఎస్టీ- 32 పోస్టులు
వయోపరిమితి:
Railway DFCCIL Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే.. జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 01-07-2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. Railway MTS పోస్టులకు 01-07-2025 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి.
Railway DFCCIL Notification 2025 Qualification :
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు CA/CMA చదివిన వారు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 60 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. మల్టీ టస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు 10వ తరగతి మరియు 60 శాతం మార్కులతో అప్రెంటీస్/ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
Railway DFCCIL ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష స్టేజ-1, స్టేజ్-2 దశల్లో జరుగుతుంది. MTS పోస్టులకు అయితే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత సర్టిపికెట్ల పరిశీలన మరియు వైద్య పరీక్షలు ఉంటాయి.
ఫీజు ఎంత:
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.1000, MTS పోస్టులకు రూ.500 ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ పద్ధతి ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు.
జీతం:
జూనియర్ మేనేజర్ – రూ.50000 – రూ.1,60,000
ఎగ్జిక్యూటివ్ – రూ.30,000 – రూ.1,20,000
MTS – రూ.16,000- రూ.45,000
How to Apply Railway MTS Jobs 2025:
అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18-01-2025 నుంచి 16-02-2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Apply Online : Click Here
Detailed Notification : Click Here
I wish I got this