SBI CBO Recruitment 2025 : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల నియామకాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,964 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 9వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
SBI CBO Recruitment 2025
పోస్టుల వివరాలు :
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. మొత్తం 2,964 పోస్టులు ఖాళీలు ఉండగా.. వీటిలో 2,600 రెగ్యులర్ పోస్టులు మరియు 364 బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఒక సర్కిల్ లోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే వారు ఎంచుకున్న సర్కిల్ యొక్క స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- మొత్తం పోస్టుల సంఖ్య: 2,964
- రెగ్యులర్ పోస్టులు : 2,600
- బ్యాక్ లాాగ్ పోస్టులు : 364
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్ లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 180 మరియు తెలంగాణ సర్కిల్ లో 230 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు వీటిని గమనించి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు ఒక సర్కిల్ లోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ : 180
- తెలంగాణ : 230
అర్హతలు :
SBI CBO Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
SBI CBO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
SBI CBO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / OBC / EWS | రూ.750/- |
SC / ST / PwBD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
SBI CBO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో 75:25 నిష్పత్తిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. స్థానిక భాష తప్పనిసరి.
- ఆన్ లైన్ పరీక్ష
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
- స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష
ఆన్ లైన్ పరీక్ష విధానం:
ఆన్ లైన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ మరియు ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ లేదా ఎకానమీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు అడుగుతారు. 120 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయం కేటాయిస్తారు. ఎస్సే రైటింగ్ లో 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. లేఖ రాయడం మరియు వ్యాసం రాయడంపై ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు
- బ్యాంకింగ్ నాలెడ్జ్ – 40 ప్రశ్నలు
- జనరల్ అవేర్నెస్ / ఎకానమీ – 30 ప్రశ్నలు
- కంప్యూటర్ ఆప్టిట్యూడ్ – 20 ప్రశ్నలు
జీతం వివరాలు:
SBI CBO Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే రూ.48,480/- ఉంటుంది. అన్ని కలుపుకుని నెలకు రూ.80,000/- వరకు జీతం ఉండవచ్చు.
దరఖాస్తు విధానం :
SBI CBO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింది దశలను అనుసరించాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లో కెరీర్ విభాగంలో వెళ్లాలి.
- CBO రిక్రూట్మెంట్ లో ‘ఆన్ లైన్ అప్లయ్’పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 09 – 05 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 29 – 05 – 2025 |
ఆన్ లైన్ పరీక్ష | జూలై 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |