SBI PO Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 24వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
SBI PO Recruitment 2025 Overview :
నియామక సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) |
పోస్టు పేరు | ప్రొబేషనరీ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 541(రెగ్యులర్ – 500, బ్యాక్ లాగ్ – 41) |
దరఖాస్తులకు చివరి తేదీ | 14 జూలై, 2025 |
అర్హత | ఏదైనా డిగ్రీ |
వయోపరిమితి | 21 నుంచి 30 సంవత్సరాలు |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు:
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 541
- రెగ్యులర్ పోస్టులు : 500
- బ్యాక్ లాగ్ పోస్టులు : 41
కేటగిరీ వారీగా రెగ్యులర్ పోస్టులు :
కేటగిరీ | ఖాళీలు |
జనరల్ | 203 |
ఓబీసీ | 135 |
ఈడబ్ల్యూఎస్ | 50 |
ఎస్సీ | 75 |
ఎస్టీ | 37 |
మొత్తం | 500 |
అర్హతలు :
SBI PO Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
SBI PO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 21 నుంచి 30 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
SBI PO Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరీ | ఫీజు |
UR / OBC / EWS | రూ.750/- |
SC / ST / PwD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
SBI PO Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- సైకోమెట్రిక్ టెస్ట్
- ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
పే స్కేల్ వివరాలు :
SBI PO Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.48,480/- తో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
SBI PO Recruitment 2025 పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 24 జూన్, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 14 జూలై, 2025 |
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ | జూలై / ఆగస్టు 2025 |
మెయిన్స్ ఎగ్జామ్ డేట్ | సెప్టెంబర్, 2025 |
సైకోమెట్రిక్ టెస్ట్ | అక్టోబర్ / నవంబర్, 2025 |
ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ | అక్టోబర్ / నవంబర్, 2025 |
Notification | Click here |
Apply Online | Click here |