SCL Recruitment 2025: సెమీ కండక్టర్ లాబొరేటరీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం అభ్యర్థుల కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. అసిస్టెంట్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారికి ఇది ఒక అద్భుత అవకాశం..
SCL Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెమీ కండక్టర్ లాబొరేటరీ అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇందులో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ లో రీ ఓపెన్ ఫారమ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఉద్యోగం పేరు : అసిస్టెంట్
- మొత్తం పోస్టుల సంఖ్య : 25
కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు:
కేటగిరి | ఖాళీల సంఖ్య |
UR | 11 |
OBC | 06 |
EWS | 02 |
SC / ST | 06 |
అర్హతలు :
SCL Recruitment 2025 సెమీ కండక్టర్ లాబొరేటరీలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ స్కిల్ ఉండాలి.
వయస్సు:
SCL Recruitment 2025 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
SCL Recruitment 2025 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / EWS / OBC | రూ.944/- |
SC / ST / PwBD / ESM / Women | రూ.472 |
ఎంపిక విధానం:
SCL Recruitment 2025 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు 100 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
రాత పరీక్ష విధానం:
రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల సమయం కేటాయిస్తారు.
- కాంటిటేటివ్ ఆప్టిట్యూట్ – 20 మార్కులు
- కంప్యూటర్ నాలెడ్జ్ – 20 మార్కులు
- జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ – 20 మార్కులు
- ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ – 20 మార్కులు
- జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ – 20 మార్కులు
జీతం వివరాలు :
SCL Recruitment 2025 సెమీ కండక్టర్ లాబొరేటరీలో అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-4 ప్రకారం రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులక బేసిక పేతో పాటు HRA, TA, DA వంటి అలవెన్సులు అందజేస్తారు.
దరఖాస్తు విధానం:
SCL Recruitment 2025 సెమీ కండక్టర్ లాబొరేటరీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో ‘రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్’ పై క్లిక్ చేయాలి.
- అనంతరం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 05 – 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |