South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
South Indian Bank Recruitment 2025
పోస్టుల వివరాలు :
సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ లో జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ గా నియమిస్తారు. కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది. ఒప్పంద వ్యవధిలో పనితీరు ఆధారంగా అభ్యర్థులను అసిస్టెంట్ మేనేజర్(స్కేల్ 1) గా రెగ్యులర్ పద్ధతిలో ప్రమోట్ చేస్తారు.
- పోస్టు పేరు : జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్
- జాబ్ లొకేషన్ : భారతదేశంలో ఎక్కడైనా
అర్హతలు :
South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ | భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. |
వయస్సు:
South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
జనరల్ | రూ.500/- |
ఎస్సీ, ఎస్టీ | రూ.200/- |
ఎంపిక ప్రక్రియ:
South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపకి చేస్తారు.
- ఆన్ లైన్ పరీక్ష
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
పే స్కేల్ వివరాలు:
South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.7.44 లక్షల ప్యాకేజీతో జీతం ఇస్తారు. దీని ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.62,000/- జీతం చేతికి అందుతుంది.
దరఖాస్తు విధానం:
South Indian Bank Recruitment 2025 బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింది దశలను అనుసరించాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది.
- అక్కడ కెరీర్ విభాగంలో ‘జూనియర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్’పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి పేరు, ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమై పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అనంతరం అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26- 05 – 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |