SSC CGL Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 4వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
SSC CGL Recruitment 2025
పోస్టుల వివరాలు :
దేశంలో అత్యంత ప్రముఖ రిక్రూట్మెంట్ పరీక్షల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ఒకటి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ వ్యవస్థలు, ట్రిబ్యునల్స్ లోని గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- పరీక్ష పేరు : కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్
- పోస్టు పేరు : గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు
- పోస్టుల సంఖ్య : 14,582
భర్తీ చేసే పోస్టులు :
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- అసిస్టెంట్
- అసిస్టెంట్ / సూపరింటెండెంట్
- ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్
- సెంట్రల్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్
- ఇన్ స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
- ఇన్ స్పెక్టర్ (ఎగ్జామినర్)
- అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్
- సబ్ ఇన్ స్పెక్టర్
- ఇన్ స్పెక్టర్ పోస్టులు
- డివిజనల్ అకౌంటెంట్
- ఇన్ స్పెక్టర్
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- ఆడిటర్
- అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / అప్పర్ డివిజన్ క్లర్క్స్
- ట్యాక్స్ అసిస్టెంట్
అర్హతలు :
SSC CGL Recruitment 2025 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ : ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సబ్జెక్టుతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ
- స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 : స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ.
- ఇతర పోస్టులకు : ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు :
SSC CGL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- ఆడిటర్లు, అకౌంటెంట్, అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్ : పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- జూనియర్ స్టాస్టికల్ ఆఫీసర్ పోస్టులకు : 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఇతర పోస్టులకు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
SSC CGL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ | రూ.100/- |
ఎస్సీ / ఎస్టీ / మహిళలు | ఫీజు లేదు |
ఎంపిక విధానం :
SSC CGL Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- టైర్-1 : కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- టైర-2 : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
SSC CGL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులక ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి. పోస్టును బట్టి పే లెవల్- 4(రూ.25,500 – రూ.81,100/-), పే లెవల్-5(రూ.29,200 – రూ.92,300/-), పే లెవల్-6(రూ.35,400 – రూ.1,12,400/-), పే లెవల్-7(రూ.44,900 – రూ.1,42,400/-) ప్రకారం జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం (How to Apply SSC CGL Recruitment 2025) :
SSC CGL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- లాగిన్ లేదా రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేసి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- SSC CGL Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 09 – 06 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 04 – 07 – 2025 |
టైర్ -1 పరీక్ష తేదీ | ఆగస్టు 13 – ఆగస్టు 30, 2025 |
టైర్ -2 పరీక్ష తేదీ | డిసెంబర్ 2025 |
Notification | Click here |
Apply Online | Click here |