TS Maheshwram Medical College Jobs 2025 తెలంగాణలోని మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 21 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
TS Maheshwram Medical College Jobs 2025
పోస్టుల వివరాలు :
తెలంగాణలోని మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 21 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ల్యాబ్ అటెండెంట్స్ – 13
- ఆప్టిషియన్ – 01
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ – 04
- ఓటీ టెక్నీషియన్ – 04
- అనస్థీషియా టెక్నీషియన్ – 04
- డెంటల్ టెక్నీషియన్ – 01
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ – 04
- రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్ – 01
- క్యాటలాగర్ – 01
- మ్యూజియమ్ అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ – 01
- ఆడియో విసువల్ టెక్నీషియన్ – 01
- వార్డ్ బాయ్ – 04
- ధోబీ / ప్యాకర్ – 03
- కార్పెంటర్ – 01
- బార్బర్ – 03
- టైలర్ – 01
- ఎటక్ట్రిషియన్ – 03
- ప్లంబర్ – 02
- థియేటర్ అసిస్టెంట్ – 06
- గ్యాస్ ఆపరేటర్ – 02
- ఈసీజీ టెక్నీషియన్ – 03
అర్హతలు:
TS Maheshwram Medical College Jobs 2025 ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.
వయస్సు:
TS Maheshwram Medical College Jobs 2025 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
TS Maheshwram Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / బీసీ అభ్యర్థులు రూ.200/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఆఫ్ లైన్ లో చెల్లించాలి. ‘ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, మహేశ్వరం’ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ:
TS Maheshwram Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక నిర్వహిణ జరుగుతుంది. అకడమిక్ విద్యార్హతల్లో వచ్చిన మార్కులకు 90 శాతం వెయిటేజీ, అభ్యర్థులు వయస్సుకు 10 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
జీతం వివరాలు :
TS Maheshwram Medical College Jobs 2025 ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి జీతాలు ఉంటాయి. రూ.15,600/- నుంచి రూ.22,750/- వరకు జీతాలు ఉంటాయి. జీతాలకు సంబంధించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
దరఖాస్తు విధానం :
TS Maheshwram Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అధికారిక వెబ్ సైల్ లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, అందులో వివరాలు నింపాలి. నింపిన అప్లికేషన్ ఫారమ్ మరియు అవసరమైన పత్రాలు జత చేసి కింద ఇచ్చిన అడ్రస్ కి మే 10వ తేదీలోపు పంపాలి.
అప్లికేషన్ సమర్పించాల్సిన అడ్రస్ :
O/o గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, మహేశ్వరం, BIET క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ | 02 – 05 – 2025 |
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ | 10 – 05 – 2025 |
తాత్కాలిక మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 13 – 05 – 2025 |
ఫిర్యాదులు స్వీకరణకు చివరి తేదీ | 16 – 05 – 2025 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 17 – 05 – 2025 |
అపాయింట్మెంట్ ఆర్డర్స్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ | 19 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Official Website & Application | CLICK HERE |