TSRTC Driver & Conductor Notification 2025 తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కండక్టర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలోని అన్ని డిపోల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు మరియు కండక్టర్ల పోస్టుల కోసం నియామకాలు చేపడుతున్నారు. M/S అక్షయ ఎంటర్ ప్రైజస్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, వయస్సు, జీతం తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
TSRTC Driver & Conductor Notification 2025
పోస్టుల వివరాలు :
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఔట్ సోర్సింగ్ విధానంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- సంస్థ పేరు : తెలంగాణ ఆర్టీసీ
- రీజియన్ : వరంగల్, కరీంనగర్ మరియు ఖమ్మం
- పోస్టు పేరు : డ్రైవర్ మరియు కండక్టర్
- పోస్టుల సంఖ్య : పేర్కొనలేదు
- భర్తీ చేసే ఏజెన్సీ : M/S అక్షయ ఎంటర్ ప్రైజస్ ఏజెన్సీ
అర్హతలు :
TSRTC Conductor :
తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలి. దరఖాస్తు సమయంలో కింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సమర్పించాలి.
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- 10వ తరగతి సర్టిఫికెట్
TSRTC Driver :
తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 నెలల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు సమయంలో కింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సమర్పించాలి.
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- 10వ తరగతి సర్టిఫికెట్
- హెవీ లైసెన్స్ (ట్రాన్స్ పోర్ట్ అండ్ బ్యాడ్జ్ నెంబర్)
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్
- RTA క్లియరెన్స్ లెటర్
వయస్సు :
తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
జీతం వివరాలు :
కండక్టర్ పోస్టులకు : తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- కన్సాలిడేటెట్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
డ్రైవర్ పోస్టులకు : తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.22,500/- జీతం ఇవ్వబడుతుంది. అదనంగా రోజుకు రూ.100/- బత్తా కూడా ఇస్తారు.
దరఖాస్తు విధానం :
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం M/S అక్షయ ఎంటర్ ప్రైజెస్, తెలంగాణ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ని సంప్రదించాలి.
సంప్రదించాల్సిన అడ్రస్ :
- A.చంద్రశేఖర్
- M/S అక్షయ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ
- ఫోన నంబర్లు : 8142463831, 9853539228
- అభ్యర్థులు పైన పేర్కొన్న నంబర్లకు కాల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TSRTC Notification : Click Here