TTD Food Safety Officer Jobs 2025 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
TTD Food Safety Officer Jobs 2025 Overview :
నియామక సంస్థ | తిరుమల తిరుపతి దేవస్థానం |
పోస్టు పేరు | సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 04 |
జీతం | రూ.44,570 – 61,960/- |
వయోపరిమితి | 42 సంవత్సరాలు |
జాబ్ లొకేషన్ | తిరుపతి |
ఉద్యోగం రకం | కాంట్రాక్ట్ పద్ధతి |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
పోస్టుల వివరాలు :
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : 01 పోస్టులు
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : 03 పోస్టులు
అర్హతలు :
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (అనుభవం అవసరం) | ఫుడ్ టెక్నాలజీ / డైరీ టెక్నాలజీ / బయో టెక్నాలజీ / ఆయిల్ టెక్నాలజీ / అగ్రికల్చర్ సైన్స్ / వెటర్నరీ సైన్స్ / బయో కెమిస్ట్రీలలో బ్యాచిలర్ డిగ్రీ.(లేదా) కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ లో డిగ్రీ + సంబంధిత ఫీల్డ్ లో 3 సంవత్సరాల అనుభవం |
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (అనుభవం అవసరం లేదు) | ఫుడ్ టెక్నాలజీ / డైరీ టెక్నాలజీ / బయో టెక్నాలజీ / ఆయిల్ టెక్నాలజీ / అగ్రికల్చర్ సైన్స్ / వెటర్నరీ సైన్స్ / బయో కెమిస్ట్రీలలో బ్యాచిలర్ డిగ్రీ.(లేదా) కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్ లో డిగ్రీ |
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు :
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని క్యాటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల్లో తీసుకుంటారు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా టీటీడీ కాంట్రాక్ట్ పొడిగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇస్తారు.
- సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : రూ.61,960/-
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : రూ.44,570/-
దరఖాస్తు విధానం :
TTD Food Safety Officer Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని అవసరమైన పత్రాలతో కింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
- అడ్రస్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(COC), సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్, TTD అడ్మినిస్ట్రేటివ్్ బిల్డింగ్, కె.టి.రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 జూలై, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |