UPSC CDS II Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్స్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ విభాగాలలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 453 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 28వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
UPSC CDS II Recruitment 2025
పోస్టుల వివరాలు :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – II ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 453 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
కోర్సు పేరు | ఖాళీలు |
ఇండియన్ మిలిటరీ అకాడమి (IMA) | 100 |
ఇండియన్ నావల్ అకాడమీ (INA) | 26 |
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) | 32 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు) (OTA) | 276 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు) (OTA) | 19 |
అర్హతలు :
UPSC CDS II Recruitment 2025 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
IMA & INA | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగం / స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ |
ఎయిర్ ఫోర్స్ అకాడమీ | ఇంజనీరింగ్ డిగ్రీ |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ | ఏదైనా డిగ్రీ (10+2 స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ ఉండాలి) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ |
వయస్సు:
UPSC CDS II Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- IMA & INA : 2 జూలై, 2002 కంటే ముందు మరియు 1 జూలై, 2007 తర్వాత జన్మించకూడదు.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ : 2 జూలై, 2002 కంటే ముందు మరియు 1 జూలై, 2006 తర్వాత జన్మించకూడదు.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ : 2 జూలై, 2001 కంటే ముందు మరియు 1 జూలై, 2007 తర్వాత జన్మించకూడదు.
అప్లికేషన్ ఫీజు :
UPSC CDS II Recruitment 2025 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
UPSC CDS II Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు.
1.రాత పరీక్ష
2.సర్వీస్ సెలక్షన్ బోర్డు(SSB) లేదా పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
3.డాక్యుమెంట్ వెరిఫికేషన్
4.మెడికల్ టెస్ట్
రాత పరీక్ష విధానం :
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావెల్ అకాడమీ మరియు ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 300 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ -100 మార్కులు, జనరల్ నాలెడ్జ్-100 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్-100 మార్కులు, జనరల్ నాలెడ్జ్ – 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
UPSC CDS II Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో మే 28వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు UPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి.
- ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ పోర్టల్ లో లాగిన అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అనంతరం ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 28, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 17, 2025
- పరీక్ష తేదీ : సెప్టెంబర్ 14, 2025
Notification | Click here |
Apply Online | Click here |