UPSC NDA NA2 Notification 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ -2 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 406 ఖాళీలు ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా UPSC NDA NA2 Notification విడుదల చేయడం జరిగింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC NDA NA 2 Notification 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ – 2 పరీక్షల నోటిఫికేషన్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 406 పోస్టులను భర్తీ చేస్తారు.
- సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
- పరీక్ష పేరు : నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల అకాడమీ-2 (NDA & NA-2)
- పోస్టుల సంఖ్య : 406
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీలు |
ఇండియన్ ఆర్మీ | 208 |
ఇండియన్ నేవీ | 42 |
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ | 120 |
ఇండియన్ నావల్ అకాడమీ | 36 |
అర్హతలు :
UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల అకాడమీ-2 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
ఇండియన్ ఆర్మీ పోస్టులకు | అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన స్థాయి పరీక్షను పూర్తి చేసి ఉండాలి. |
ఎయిర్ ఫోర్స్ మరియు నావల్ పోస్టులకు | అభ్యర్థులు ఏదైేనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. |
వయస్సు :
UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- అభ్యర్థులు 01/01/2007 కంటే ముందు మరియు 01/01/2010 తర్వాత జన్మించకూడదు.
అప్లికేషన్ ఫీజు :
UPSC NDA NA2 Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటలిజెన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా జరుగుతుంది.
- రాత పరీక్ష
- సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
పరీక్ష విధానం :
UPSC NDA NA2 Notification 2025 పోస్టులకు రాత పరీక్ష రెండు పేపర్లలో నిర్వహిస్తారు. రెండు పరీక్షలు కలిపి 900 మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్ కి 2.5 గంటల చొప్పున 5 గంటల సమయం ఉంటుంది.
పేపర్ 1(మ్యాథమెటిక్స్) | 300 మార్కులు | 2.5 గంటలు |
పేపర్ 2(జనరల్ ఎబిలిటీ టెస్ట్) | ఇంగ్లీష్ – 200 మార్కులుజనరల్ నాలెడ్జ్ – 400 మార్కులు | 2.5 గంటలు |
ఫిజికల్ స్టాండర్డ్స్ :
- సాయుధ దళాలు : 157 సెం.మీ ఎత్తు ఉండాలి.
- ఫ్లయింగ్ బ్రాంచ్ : 163 సెం.మీ ఎత్తు ఉండాలి.
దరఖాస్తు విధానం :
UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు UPSC వెబ్ సైట్ ని సందర్శించాలి.
- న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.
- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 06 – 2025
- పరీక్ష తేదీ : 14 – 09 – 2025
Notification | Click here |
Apply Online | Click here |