UPSC Special Recruitment 2025 | UPSC 399 స్పెషల్ ఉద్యోగాలు

By: Afzal

On: June 17, 2025

Follow Us:

UPSC Special Recruitment 2025

UPSC Special Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ని ప్రకటించింది. వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల్లో గ్రూప్ ‘ఎ’ మరియు గ్రూప్ ‘బి’ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 399 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. 

UPSC Special Recruitment 2025 Overview : 

నియామక సంస్థ పేరుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టుల పేర్లుఅసిస్టెంట్ డైరెక్టర్, కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్-3, డిప్యూటీ డైరెక్ట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య399
దరఖాస్తులకు చివరి తేదీజూలై 03, 2025

పోస్టుల వివరాలు : 

UPSC Special Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 399 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మనం ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మిగితా ఖాళీల వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చూడగలరు. 

అర్హతలు : 

UPSC Special Recruitment 2025 స్పెషల్ డ్రైవ్ కింద భర్తీ చేయనున్న ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంటాయి. అన్ని పోస్టుల విద్యార్హతల కోసం పూర్తి నోటిఫికేషన్ చూడగలరు. 

  • డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ : ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సీఎస్, ఐటీ లేదా సంబంధిత రంగాలలో బీఈ / బీటెక్. (లేదా) బీఎస్సీ(ఇంజనీరింగ్) (లేదా) ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో AMIE. (లేదా) ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ తో ఫిజిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా MCA

వయస్సు : 

UPSC Special Recruitment 2025 స్పెషల్ డ్రైవ కింద భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. 

  • డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్  : పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  అప్లికేషన్ ఫీజు : 

UPSC Special Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.25/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

UPSC Special Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింద దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • షార్ట్ లిస్ట్ : ముందుగా అభ్యర్థులు ఇచ్చిన వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • రిక్రూట్మెంట్ టెస్ట్ : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూకు 75:25 వెయిటేజీ ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ : ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు : 

UPSC Special Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి లెవల్-7 నుంచి లెవల్-12 వరకు జీతాలు ఉంటాయి. 

  • డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు లెవల్-10 ప్రకారం జీతం ఉంటుంది. అభ్యర్థులకు అన్ని కలుపుకుని నెలకు రూ.లక్షకు పైగా జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

UPSC Special Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో మీరు అప్లయ్ చేయాలనుకున్న పోస్ట్ పక్కన్న ‘Apply Now’పై క్లిక్ చేయాలి. 
  • చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 03 జూలై, 2025

Notification : Click here

Apply Online : Click here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment